సంక్రాంతి సినిమాల రచ్చ మొదలయ్యింది. ఒకదాని తరువాత ఒకటి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక మొదటి నుంచి అనుకున్నట్లే పలు సినిమాల విడుదల తేదీలు తారుమారు అయ్యాయి. ఈరోజు జరిగిన నిర్మాతల మీటింగ్ లో వాటికి ఒక క్లారిటీ వచ్చింది. పవన్ అభిమానులందరినీ నిరాశ పరుస్తూ భీమ్లా నాయక్ వెనుకంజ వేసింది. ఇప్పటివరకు తగ్గేదేలే అన్న నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సైతం తన హీరో మాట విని వెనక్కి తగ్గినట్లు తెలుపుతూ అధికారికంగా తెలిపారు. ఇకపోతే పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హస్తం ఉందని అంటున్నారు పలువురు నెటిజన్లు. ఆయనే దగ్గరుండి ఈ సినిమాను వాయిదా వేయించినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాలని, ఆర్ఆర్ఆర్ కి కొద్దిగా సమయం ఇవ్వాలని రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య.. త్రివిక్రమ్ ని కలిసి కోరినట్లు సమాచారం. దీంతో త్రివిక్రమ్ ఈ విషయమై పవన్ తో చర్చలు జరిపి భీమ్లా నాయక్ ని వాయిదా వేసినట్లు సమాచారం. క్రిస్టమస్ కి పవన్, భార్యతో కలిసి విదేశాలకు వెళ్తున్న క్రమంలో పవన్ ని కలిసే వీలు లేక జక్కన్న, త్రివిక్రమ్ ని కలిసి చర్చించారట. దీంతో ఈ బాధ్యతను ఆయన భుజాలమీదకు వేసుకున్నారట. త్రివిక్రమ మాట పవన్ వింటారు అన్నది అందిరికి తెలిసిందే. దీంతో ఆయనే పవన్ ని ఒప్పించారట.నిర్మాతలు సైతం ససేమీరా అన్నకూడా పవన్ చెప్పడంతో వారు కూడా వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఏది ఏమైనా రాజమౌళి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడి సినిమాను వాయిదా వేయించారని నెటిజన్లు మాట్లాడుకొంటున్నారు.