కన్నడ నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తాయి అని KGF సినిమా నిరూపించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలు కూడా కన్సిడర్ చెయ్యని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు పాన్ ఇండియా ఆడియన్స్ ని తిరిగి చూసేలా చేశారు ప్రశాంత్ నీల్ అండ్ యష్. ఈ ఇద్దరు వేసిన దారిలో ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అడుగులు వేస్తుంది. కంటెంట్ ఉన్న సినిమాలని, హై బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తుంది KFI. ఇదే తరహాలో KFI నుంచి వస్తున్న మరో భారి బడ్జట్ సినిమా ‘మార్టిన్’. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, నాలుగు సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘దృవ సర్జా’ నటిస్తున్న లేటెస్ట్ మూవీనే ‘మార్టిన్’.
ఏపీ అర్జున్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మార్టిన్ సినిమా రూపొందుతుంది అనే విషయాన్ని మేకర్స్ ఒక్క పోస్టర్ తోనే అర్ధం అయ్యేలా చేశారు. ఆర్మీ, వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మార్టిన్ మూవీని సెప్టెంబర్ 30న ఆడియన్స్ ముందుకి తీసుకోనిరావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, మార్టిన్ మూవీ టీజర్ ని ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ లో దృవ సర్జా, గన్ పట్టుకున్న లుక్ అండ్ ఫీల్ ని చూస్తే ‘మార్టిన్’ మూవీ KFI నుంచి వచ్చే మరో సెన్సేషనల్ హిట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఈ యంగ్ హీరోకి పొగరు సినిమాతో KFIలో మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది కానీ సౌత్ లోని ఇతర భాషల్లో ఇంకా సాలిడ్ ఇమేజ్ ని సొంతం చేసుకోలేదు. ఇలాంటి సమయంలో పాన్ ఇండియా సినిమా అంటే రిస్క్ అనే చెప్పాలి. మరి మాస్ హీరోగా ఎదుగుతున్న దృవ సర్జా ‘మార్టిన్’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో KFI నుంచి వచ్చిన మరో యష్ అవుతాడో లేదో తెలియాలి అంటే సెప్టెంబర్ 30 వరకూ ఆగాల్సిందే.
MARTIN TEASER ON 23rd FEBRUARY.
Bless and support us 😊
Jai Hanuman 💪🏼😊 pic.twitter.com/xaUYNpzFWQ— Dhruva Sarja (@DhruvaSarja) February 15, 2023