Dhanush : నా ఏవీ చూశాక నాకు మా నాన్న గుర్తుకు వచ్చారు. ఈ రోజు ఫాదర్స్ డే. ఆయన మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ ఏవీ చూశాక నాకు ఆయన కష్టం గుర్తుకు వస్తోంది. ఆయన ఒక రైతుగా కష్టపడితే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. శేఖర్ కమ్ముల గారికి నేను థాంక్స్ చెప్పాలి. ఇది నాకు తెలుగులో రెండో సినిమా. సార్ నాకు మొదటిది. శేఖర్ గారు నాకు ‘సార్’ మూవీ కంటే ముందే కథ చెప్పారు. కానీ కంటెంట్ రాయడానికి ఆయనకు ఎక్కువ టైమ్ పట్టింది. ఆయన కష్టం ఈ సినిమాలో అందరికీ కనిపిస్తుంది. రాజమౌళి గారు చెప్పినట్టే ఆయన చాలా మొండి వ్యక్తి. ఆయన కరెక్ట్ దారిలో వెళ్తున్నారు కాబట్టే అలా ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా షూట్ కు వచ్చారు. చాలా రోజులు హెల్త్ బాగా లేక ఇబ్బంది పడ్డారు.
Read Also : Shekhar Kammula : రాజమౌళి మాకు ధైర్యం ఇచ్చాడు.. శేఖర్ కమ్ముల కామెంట్స్
ఆయన ఆరోగ్యం గురించి చాలా కంగారు పడ్డాను. ఇప్పుడు కోలుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. నాగార్జున గారు మ్యాన్ ఆఫ్ క్లాస్. ఆయనతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు నా సిస్టర్ చాలా పెద్ద ఫ్యాన్. ఆయన మూవీలో మాకు చాలా సపోర్ట్ చేశారు. రష్మిక చాలా సినిమాలకు లక్. ఈ మూవీకి కూడా కలిసి వస్తుందని అనుకుంటున్నా. ఆమె చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. అందుకే పాన్ ఇండియా క్రష్ అయింది. సునీల్ నారంగ్ చాలా ఓపికతో మాకు సపోర్ట్ చేశారు. మూవీని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అందరికీ థాంక్యూ అంటూ చెప్పారు.
Read Also : Rashmika : ఎప్పుడు పోతామో తెలీదు.. హ్యాపీగా ఉండండి..