Shekhar Kammula : కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్లం ఈ రోజు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం అంటే అది రాజమౌళి వల్లే. ఆయనే మాకు ధైర్యం ఇచ్చాడు. ఆయన రావడం సంతోషంగా ఉంది. నాగార్జున గారిని డైరెక్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడ్డా. ఆయన పెద్ద స్టార్. ఆయనతో ఫస్ట్ టైమ్ చేశాను. ఆయనను ఎలా డీల్ చేస్తానో అనుకున్నా. కానీ ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న ఆయన.. నా సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది.
Read Also : Rashmika : ఎప్పుడు పోతామో తెలీదు.. హ్యాపీగా ఉండండి..
ఎన్నో మార్చుకున్నారు నా కోసం. రాత్రి పూట ఆయన షూటింగ్ చేయరు. ఆదివారం షూట్ చేయరు. కానీ నా కోసం చేశారు. అది ఆయన డెడికేషన్. ధనుష్ లాంటి నటుడు మనకు దొరకరు. చెత్తకుప్పల్లో షూటింగ్ చేయాలన్నా వెంటనే ఓకే అనేస్తాడు. ఏది చేయమంటే అది చేస్తాడు. అది ఆయన గొప్పతనం. అందుకే ఆయన్ను ఇండియన్ ప్రైడ్ అన్నాను.
రష్మిక లోపల, బయట ఒకే విధంగా ఉంటుంది. సినిమా పట్ల నేను చాలా హ్యాపీ. మూవీ అద్భుతంగా వచ్చింది. మీరు సరికొత్త ఎక్స్ పీరియన్స్ చూస్తారు. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చారు.
Read Also : Kubera Trailer : కుబేర ట్రైలర్ వచ్చేసింది..