మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్, ‘ధమాకా’ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇప్పటికే ధమాకా నుంచి మూడు పాటలు రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ హిట్ అవ్వగా, ఈ మూవీ నుంచి నాలుగో పాట ‘దండ కడియాల్’ని త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ అనౌన్స్మెంట్ గురించి ట్వీట్ చేస్తూ ‘ప్రోమో’ సాంగ్ ని విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే ‘దండ కడియాల్’ సాంగ్ మంచి జోష్ ఉండే పాటలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇప్పటికే ‘జింతాక్’ సాంగ్ తో అదిరిపోయే మాస్ నంబర్ ఇచ్చాడు, ఇప్పుడు ‘దండ కడియాల్’తో ఇంకో మాస్ నంబర్ ని రవితేజ ఫాన్స్ కి గిఫ్ట్ ఇస్తున్నట్లు ఉన్నాడు.
భీమ్స్ సెసిరోలియో ఈ ‘దండ కడియాల్’ సాంగ్ ని ‘సాహితీ చాగంటి’, ‘మంగ్లీ’తో కలిసి పడడమే కాకుండా లిరిక్స్ కూడా రాయడం విశేషం. మరో మూడు వారాల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ‘ధమాకా’ సినిమాని రవితేజ ముందెన్నడూ లేనంతగా ప్రమోట్ చేస్తున్నాడు. చిత్ర యూనిట్ అంతా షోస్, ఈవెంట్స్ కి వెళ్తుంటే… ఎప్పుడూ ప్రీరిలీజ్ ఈవెంట్ లో, కొన్ని కామన్ ఇంటర్వ్యూస్ లో మాత్రమే మాట్లాడే రవితేజ ఈసారి ‘ధమాకా’ సినిమాని ముందుండి ప్రమోట్ చేస్తున్నాడు. నెల రోజుల ముందు నుంచే రవితేజ ఒక సినిమాని ప్రమోట్ చేయడం ఇదే మొదటిసారి. మరి ఈ మూవీతో మాస్ మహారాజ్ హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.