Devi Prasad Acting in Bhutaddam Bhaskar Narayana is Marvellous: భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా నటించిన ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ గా నటించింది. కొత్త దర్శకుడు పురుషోత్తం రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక డిటెక్టివ్ డ్రామాగా తెరకెక్కింది. ఇక దానికి మైథాలజికల్ టచ్ ఇవ్వడంతో ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవుతుంది. అయితే ఈ సినిమా మొత్తం మీద హైలెట్ గా నిలిచిన నటుడు దేవి ప్రసాద్. గతంలో పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన నటుడిగా ఇప్పుడు బిజీ అవుతున్నారు. ఆడుతూ పాడుతూ, లీలామహల్ సెంటర్, బ్లేడ్ బాబ్జి, మిస్టర్ పెళ్ళికొడుకు, కెవ్వు కేక వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అయితే దర్శకుడిగా కంటే నటుడుగానే ఆయన ఎక్కువ పాపులర్ అవుతున్నారు.
Mamitha Baiju: అదేంటి మొన్న బాలా కొట్టాడు అంది.. ఇప్పుడేమో చాలా సున్నితమంటుంది
ఈ మధ్యకాలంలో ఆయన నటించిన విరాటపర్వం, నాంది, నీది నాది ఒకే కథ, జయమ్మ పంచాయతీ వంటి సినిమాలలో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. అయితే అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ భూతద్దం భాస్కర నారాయణ లో ఒక పోలీస్ అధికారిగా ఆయన నటన విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా ఈరోజే రిలీజ్ అయింది కాబట్టి పాయింట్ రివీల్ చేయడం అంత కరెక్ట్ కాదు కానీ క్లైమాక్స్ లో వచ్చే సీన్ మొత్తానికి దేవి ప్రసాద్ హీరో అనేలా ఆయన నటన ఆకట్టుకుంటుంది. గతంలో చాలా సౌమ్యుడిగా ఎక్కువ పాత్రలు చేస్తూ వచ్చిన ఆయన భూతద్దం భాస్కర నారాయణలో మాత్రం అందుకు భిన్నమైన పాత్రలో కనిపించాడు. సినిమా మొత్తం మీద ఆయన నటన కచ్చితంగా అందరికీ గుర్తుండిపోయేలా స్క్రీన్ మొత్తాన్ని ఆయన డామినేట్ చేసేసాడు. ఈ సినిమా ఆయన కెరియర్లో ది బెస్ట్ సినిమాలలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు