నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాతో బాలయ్య వరుసగా వంద కోట్లు కొల్లగొట్టిన నాలుగు సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు. కాగ ఈ సినిమా ఫిబ్రవరి 21 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది నెట్ ఫ్లిక్స్. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోను సెన్సేషన్ చేస్తుంది డాకు మహారాజ్.
Also Read : VIJAY : నేడు విజయ్ ‘TVK’ పార్టీ రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మొదటి వారంలో డాకు మహారాజ్ 2.4 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియాలో ఈ వారం టాప్ 10 మూవీస్ లో 2వ స్తానంలో నిలిచింది డాకు. అలాగే వరుసగా 8 రోజుల పాటు 13 దేశాల్లో టాప్ 10 లో ఒకటిగా ట్రేండింగ్ అవుతుంది డాకుమహారాజ్. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప 7 రోజుల పాటు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవగా ఆ రికార్డును డాకు మహారాజ్ బీట్ చేసింది. అలాగే గత వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 నాన్-ఇంగ్లీష్ సినిమాల గ్లోబల్ చార్ట్ లో 5వ సినిమాగా డాకు మహారాజ్ అదరగొట్టింది. ప్యూర్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన డాకు మహారాజ్ మాస్ ఆడియెన్స్ ను విశేషంగా మెప్పించింది. ముఖ్యంగా మలయాళ ఆడియెన్స్ లో డాకు మహారాజ్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫీకి విశేష స్పందన రాగా తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది.