Cinematographer G. Murali comments on Kushi: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతోందన్న సంగతి తెలిసిందే. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ అందుకున్న ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోన్న నేపథ్యంలో సినిమాకు పనిచేసిన అనుభవాలు తెలిపారు సినిమాటోగ్రాఫర్ జి.మురళి. నేను 2005 నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను, అందాల రాక్షసి మూవీకి పనిచేశానని అన్నారు. ఆ తర్వాత నేను చేసిన లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఖుషి’నే అని, మైత్రీ రవి గారి ద్వారా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చానని అన్నారు. ఈ సినిమాకు మైత్రీ మూవీ ప్రొడ్యూసర్స్ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చని పేర్కొన్న ఆయన ఎందుకంటే వారికి సినిమాల మీద ఉన్నంత ప్యాషన్ నేను ఇంకో ప్రొడక్షన్ లోనూ చూడలేదని అన్నారు.
Bedurulanka: రిస్కు చేసి దూకుతున్న బెదురులంక.. ఏ మాత్రం తేడా కొట్టినా?
సినిమా బాగా వచ్చేందుకు ఏది కావాలన్నా సమకూర్చుతారని, ఫిలిం మేకింగ్ లో వాళ్లు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారని అన్నారు. ప్రేమ గురించి కొన్ని కలలు కనే యువకుడికి లవ్, లైఫ్ అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండదని తెలిసిరావడమే ఈ సినిమా నేపథ్యం అని మురళి పేర్కొన్నారు. మణిరత్నం సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చూపించే విజువల్ బ్యూటీ ఈ చిత్రంలో చూస్తారని, అయితే అలాంటి సీన్స్ ను మేము కాపీ కొట్టలేదుని, అలాంటి ఫీల్ కలిగించేలా విజువల్స్ ఉంటాయని అన్నారు. దర్శకుడు శివ నిర్వాణ వ్యక్తిగతంగా చాలా మంచివాడని, సినిమా మేకింగ్ మీద ఇష్టం ఉన్న దర్శకుడని అన్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారని, సినిమా గురించే ఆలోచిస్తుంటాడని అన్నారు. ఆయన మ్యూజిక్ సెన్స్ సూపర్బ్ అని, ఇవాళ ‘ఖుషి’లో ఇంతమంచి మ్యూజిక్ వచ్చిందంటే దానికి శివ నిర్వాణ మ్యూజిక్ టేస్ట్ కారణం అని అన్నారు.