Bedurulanka 2012 team opts for paid premieres in telugu states: ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసి… మంచి పాపులారిటీ కొట్టేసిన హీరో కార్తికేయ. ఇక ఆర్ఎక్స్ 100 తర్వాత కార్తికేయ పలు సినిమాలు చేసినప్పటికీ.. ఆ రేంజ్ హిట్ మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఆయన ఆశలన్నీ రాబోయే చిత్రం బెదురులంక 2012 మీదనే ఉన్నాయి. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తికేయ హీరోగా నటించగా.. హీరోయిన్ గా డీజే టిల్లు ఫేం నేహాశెట్టి నటించింది. ఇక ఈ మూవీని క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈయనకు ఇది తొలి సినిమా. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సినిమా మీద మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. బెదురులంక 2012 చిత్రాన్ని ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. అయితే ఈ సినిమా మీద ఇంకాస్త బజ్ తెప్పించేందుకు.. బెదురులంక.. సామజవరగమన మూవీ ఐడియాను ఫాలో అవుతుందని చెప్పాలి. సామజవరగమన చిత్రం రిలీజ్ కు ముందే ప్రిమియర్ షోలు ప్లాన్ చేసి… సక్సెస్ అయ్యారు.
Samantha: ఆ అవకాశం వస్తే మాత్రం వదలొద్దు…సమంత పోస్ట్ వైరల్
ప్రిమియర్ షోలతో ఆ సినిమాకు మౌత్ టాక్ పెరిగింది. అలా సామజవరగమన సక్సెస్ కొట్టింది. ఇప్పుడు ఇదే ప్లాన్ ను బెదురులంక 2012 మూవీ మేకర్స్ ఫాలో అవ్వనున్నారు. అలా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని స్పెషల్ ప్రీమియర్ వేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. హైదరాబాద్, వైజాగ్, కాకినాడ, గుంటూరు, విజయవాడతోపాటు పలు పట్టణాల్లో ఐదు పెయిడ్ షోలు వేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే దైర్యం ఉండాల్సిందే. ఏ మాత్రం తేడా కొట్టిన మౌత్ టాక్ తో ఈ సినిమాకు మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే దర్శక నిర్మాతలు కథ, కథనం మీద నమ్మకంతోనే ప్రిమియర్ షోలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కార్తికేయకు ఈ సినిమాతో మంచి హిట్ రాబోతున్నట్లు అర్థం అవుతుంది. ఇక ఈ మూవీ 2012లో యుగాంతం కాన్సెప్ట్‌తో విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రానుంది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్నితదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. లౌక్య ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) ఈ చిత్రానికి నిర్మాతలు.