కోవిడ్ ఎఫెక్ట్ సినీ రంగం పై భారీగానే పడింది. ఎందుకంటే OTT సంస్థలు విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయి. ఇవ్వాల రేపు చేతిలో ఫోన్ లేని వారంటూ లేరు. ఇక ఎంతటి సినిమా అయిన విడుదలైన వారం రోజులకే ఫోన్‌లో వచేస్తున్నాయి. దీంతో జనాలు థియేటర్ లకు రావడం చాలా వరకు తగ్గించారు. పెద్ద, చిన్న సినిమాలతో సంబంధం లేకుండా జనాలతో కిక్కిరిసిపోయిన థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. చాలా థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి కూడా. కోవిడ్ నుంచి కోలుకున్న కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లే కారణం. ఈ విషయం పై ఇప్పటికే చాలా మంది నటీనటులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా ఓటీటీల పై తీవ్రంగా మండిపడ్డారు.
Also Read : Nagarjuna : పాన్ ఇండియా చిత్రాల పై నాగార్జున కామెంట్స్ వైరల్..
మే 1న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైన WAVES 2025 సమ్మిట్‌లో సినీ సెలబ్రిటీలు ఎందరో పాల్గొన్నారు. సినీ దిగ్గజాలు భవిష్యత్ ఎంటర్‌టైన్‌మెంట్ గురించి చర్చించేందుకు ఒకే వేదికపైకి వచ్చారు. ఇందులో భాగంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఓటీటీ సంస్థల వ్యాపార శైలి ఏ మాత్రం అంగీకరించవలసిన సిద్ధంగా లేదు. ఓ వస్తువుని తన వద్ద వినియోగదారులు కొనాలని కోరిన, కొనకపోవడంతో.. అదే వస్తువును 8 వారాల్లో వారి ఇంటి ముందుకు తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుంది. అలా ఉంది ఇప్పుడు సినిమాల పరిస్థితి. ఇప్పటికైనా ఈ ఓటీటీల బిజినెస్ శైలి మారడం చాలా అవసరం. ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూస్తేనే వారికి పూర్తి ఆనందం ఉంటుంది’ అని తెలిపారు. ప్రస్తుతం అమీర్ మాటలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.