ప్రజంట్ ముంబైలో ‘వేవ్స్’ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇందులో భాగంగా అగ్ర నటుడు నాగార్జున అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పెవిలియన్’ స్టాల్‌ను ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పాన్ ఇండియా చిత్రలపై.. దిగ్గజ దర్శకుడు రాజమౌళి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
నాగార్జున మాట్లాడుతూ.. ‘ నేటితరం ప్రేక్షకులు హీరోలను లార్జర్ దేన్ లైఫ్ రోల్స్‌లో చూడటానికి ఇష్టపడుతున్నారు, బాహుబలి, పుష్పరాజ్.. రాఖీ (కేజీఎఫ్) సినిమాల భారీ విజయానికి అదే కారణం. ఇలాంటి కథలను మనం ఇంతకు ముందు చూశాం. కానీ ఉత్తరాది ప్రేక్షకులు కూడా పుష్పరాజ్, యశ్ లాంటి హీరోల్ని అక్కడి సినిమాల్లో చూడాలని అనుకుంటున్నారు. వారందరికీ కావాల్సిందే ఇలాంటి హీరోలు. రోజువారీ జీవితంలో ఎంతో ఒత్తిడిలు ఎదురుకుంటున్న ప్రజలు సినిమాలు చూసి ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలి అనుకుంటారు. అలాంటి ప్రేక్షకులకు మనం తెరపై మాయాజాలం చూపించాలి. భారతీయ సినిమాలు కథ, కథనాల విషయంలో ప్రాంతీయతను కోల్పోకుండా చిత్రాల్ని రూపొందిస్తున్నాయి. అవి స్థానిక కథల నుంచి దూరంగా వెళ్లడం లేదు. అందుకే భారతీయ సినిమాలు విజయవంతమయ్యాయి. దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’లోని ప్రతీ సీన్‌లో తెలుగుతనం ఉట్టిపడేలా తీశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు దీన్ని ఇష్టపడ్డారు. మీరు మీ మాతృభాష పై దృష్టి పెట్టి, కథ చెబితే అది కచ్చితంగా ప్రేక్షకులకు దగ్గరవుతారు’ అంటూ తెలిపాడు.