యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి బర్త్ డే సెలబ్రేషన్స్ ను “కింగ్ డమ్” సినిమా సెట్ లో జరిపారు. హీరో విజయ్ దేవరకొండ, సినిమా టీమ్ మెంబర్స్ ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. “కింగ్ డమ్” సినిమా షూటింగ్ లో ప్రతి రోజూ ఎంజాయ్ చేశామని, ఒక గొప్ప కథను ప్రేక్షకులకు చెప్పబోతున్నామని విజయ్ దేవరకొండ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Sivangi: ఆసక్తికరంగా ‘శివంగి’ ట్రైలర్
“కింగ్ డమ్” చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 30న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.