సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలు తెరపై మాత్రమే కాదు, తెరవెనుక కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతుంటాయి. అలాంటి జంటే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా. వీరిద్దరూ కలిసి చేసిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ఘన విజయం సాధించడమే కాకుండా, వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందని చాలా కాలంగా పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కూడా ఈ విషయం పై పదే పదే స్పందిస్తూ తమ మధ్య ఉన్నది ఒక మంచి స్నేహం మాత్రమే అని స్పష్టం చేసిన, వారి కలయిక ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
Also Read : Anupama : నాకు నటన రాదన్నారు.. అదే నా శక్తిగా మారింది
తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ ఒకే కారులో కనిపించడం మరోసారి చర్చనియాంశంగా మారింది. రష్మిక కారులోకి ఎక్కిన వెంటనే విజయ్ దేవరకొండ ముందు సీట్లో కనిపించిన దృశ్యాన్ని ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. ఆ ఫోటో నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అయింది. వీరిద్దరి బాండింగ్‌ను చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘‘వాళ్లిద్దరూ కలిసే ఉండాలి’’ అనేలా కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి జంటకు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక కెరీర్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు పలు పెద్ద సినిమాల్లో నటిస్తున్నారు. రష్మిక ఇటీవల బాలీవుడ్ ప్రాజెక్టుల్లోనూ తన స్థానం సంపాదించుకుంటుండగా, విజయ్ టాలీవుడ్‌లో తన మాస్ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేసేందుకు పాటుపడుతున్నారు.