Aadarsha Kutumbam : మూడు రోజుల్లో 75 కోట్లు.. నిర్మాతల అధికారిక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విక్టరీ వెంకటేష్ మళ్ళీ తన మార్క్ చూపించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ (AK-47: హౌస్ నెం.47) సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంటూ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా ఫ్యామిలీ సినిమాలకు కలెక్షన్లు నిలకడగా వస్తుంటాయి. కానీ వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’ మాత్రం మాస్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ సినిమా అఫీషియల్‌గా ‘బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్’గా నిలిచింది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్ పక్కన శ్రీనిధి శెట్టి, నివేదా థామస్, రోహిత్ నారా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్. థమన్ అందించిన సంగీతం సినిమా భారీ విజయానికి మరింత ఊపునిచ్చింది. అలాగే నవీన్ నూలి ఎడిటింగ్, ఎ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ వర్క్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఈ సంచలన విజయానికి ఆనందం వ్యక్తం చేస్తూ, చిత్ర బృందం అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో వెంకటేష్ తనదైన స్టైల్లో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Also Read
- Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
- CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
- Prabhas: బాకీ తీర్చుకోనున్న 'డార్లింగ్' ప్రభాస్!
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : మూడు రోజుల్లో 75 కోట్లు.. నిర్మాతల అధికారిక ప్రకటన
-
Selfie Video : రష్యా యుద్ధ క్షేత్రంలో ఐదుగురు తెలుగు యువకులు.. ‘ఇదే మా చివరి రోజు కావచ్చు’.!
-
Reliance: మార్కెట్లో అంబానీ సునామీ.. ఒక్క రోజే రూ. 1.29 లక్షల కోట్లు జంప్!
-
US Plane Crash: భయంతో అరిచిన పైలట్.. క్షణాల్లో కుప్పకూలిన విమానం.. వెలుగులోకి చివరి క్షణాలు.!
-
Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!