మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి రూట్ మార్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంకటేశ్‌తో ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ అనే ఫ్యామిలీ టైటిల్‌ను ఎంచుకున్నప్పటికీ, విడుదలైన లోగో (టైటిల్ డిజైన్) మాత్రం ఫ్యామిలీలో దాగిన వైలెన్స్‌ను సూచిస్తోంది. సాధారణంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు చిరునామా అయిన వెంకటేష్‌తో, త్రివిక్రమ్ ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారనే ప్రశ్న ఈ లోగోతో మొదలైంది. ‘ఆదర్శ కుటుంబం’ టైటిల్‌కు అనుబంధంగా లోగోలో కనిపించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ఆదర్శ కుటుంబం’ అనే…
తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రానున్న చిత్రం కోసం సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేష్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. అందుకే వీరి కలయిక, ప్రకటనతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. Also Read : Akhanda2 :…