Jammu Kashmir: జమ్మూలోని అఖ్నూర్ ప్రాంతంలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంత భారీ ఆయుధాలు, మెటీరియల్ లభ్యతను చూస్తే ఈ ఉగ్రవాదులు కచ్చితంగా దీర్ఘకాలిక యుద్ధం చేయాలనే ఉద్దేశంతో పెద్ద కుట్రకు పాల్పడ్డారని స్పష్టమవుతోంది. స్వాధీనం చేసుకున్న వస్తువులలో M4 కార్బైన్, AK-47 రైఫిల్, ఇతర సామగ్రి వంటి అధునాతన ఆయుధాలు ఉన్నాయి.…
చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్‌లోని జంగిల్ వార్‌ఫేర్ యూనిట్ కోబ్రా(కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) ఇన్‌స్పెక్టర్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Encounter: జార్ఖండ్ రాష్ట్రంలోని సింగభూం జిల్లా పరిధిలోని అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరుగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో మావోలు తిరుగుతున్నారన్న సమాచారం అందుకున్న సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, కోబ్రా బెటాలియన్, రాష్ట్ర సాయుధ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు.
మహారాష్ట్ర తీరంలోని ఓ పాడుపడిన పడవలో మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు, పత్రాలు లభ్యం కావడం కలకలం రేపింది. తీరానికి కొట్టుకొచ్చిన ఆ బోటులో ఏకే-47 తుపాకులు లభ్యం కావడంతో ఉగ్రకోణంలో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.