9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
- చైనా మార్కెట్లో కొత్త వన్‌ప్లస్ టర్బో 6Vs స్మార్ట్‌ఫోన్ విడుదల
- 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్..
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్
- వెనుకవైపు OIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 2MP మోనో కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా
- 9,000mAh భారీ బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Turbo 6Vs Launched: వన్‌ప్లస్ చైనా మార్కెట్లో తన కొత్త ఫోన్ OnePlus Turbo 6Vsను విడుదల చేసింది. ఈ ఏడాది లాంచ్ అయిన OnePlus Turbo 6Vకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా దీనిని తీసుకొచ్చింది. భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను రూపొందించింది. ఇందులో 50MP ప్రధాన కెమెరాతో పాటు 16MP సెల్ఫీ కెమెరాను అందించింది. ఈ మొబైల్ లో 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. 800 నిట్స్ సాధారణ బ్రైట్‌నెస్‌తో పాటు గరిష్ఠంగా 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఫోన్ దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్స్‌ను కలిగి ఉంది.
పనితీరు విషయానికి వస్తే.. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనితో 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజ్ అందించారు. ఆండ్రాయిడ్ ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇతర ఫీచర్లలో స్టీరియో స్పీకర్లు, X-యాక్సిస్ మోటార్, IR బ్లాస్టర్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 5G, NFC, USB Type-C పోర్ట్‌ను అందించారు. కెమెరా విభాగంలో వెనుకవైపు OIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP కెమెరాను అమర్చారు.
Also Read
- Redmi M100 Pro: రెడ్మీ M100 Pro 5G ఫోన్ లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
- UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
- SOS బటన్, Family Assist ఫీచర్లtho 'సీనియర్ సిటిజన్ల' కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
- Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
ఈ ఫోన్లో 9,000mAh భారీ బ్యాటరీని అందించడం మరో ప్రత్యేకత. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో ఇతర పరికరాలకు కూడా ఫోన్ ద్వారా ఛార్జింగ్ అందించవచ్చు. చైనాలో OnePlus Turbo 6Vs 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.52,851గా ఉంటుంది. ఆరెంజ్, నోవా వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను పొందవచ్చు. ప్రస్తుతం వన్‌ప్లస్ చైనా అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ లిస్ట్ అయింది. అయితే ప్రస్తుతానికి స్టాక్ అందుబాటులో లేదని వెబ్సైట్లో కనిపిస్తోంది. ఈ ఫోన్ భారత మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
-
Hyderabad: మద్యం మత్తులో దారుణం.. కన్న కొడుకునే గొంతు నులిమి చంపిన తండ్రి..!
-
Redmi M100 Pro: రెడ్మీ M100 Pro 5G ఫోన్ లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
-
India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?