Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తానని అభిమానులకు మాటిచ్చిన ‘డార్లింగ్’ ప్రభాస్.. ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. గతేడాది ప్రభాస్ నుంచి కొత్త సినిమా విడుదల కాలేదు. ఈ ఏడాది రెండు సినిమాలు వస్తాయని అభిమానులు ఆశించినా.. ‘రాజా సాబ్’తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే వచ్చే ఏడాది మాత్రం ప్రభాస్ తన అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వనున్నారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమా విడుదల వాయిదా పడటంతో వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ కూడా విడుదల తేదీ వాయిదా పడనుంది. ఫౌజీ విడుదల నేపథ్యంలో స్పిరిట్‌ను 2027 దీపావళికి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలైతే ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటారు.
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ప్రభాస్ సినిమాల జాబితాలో యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్ – పార్ట్ 1’ కూడా చేరింది. ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన బాహుబలి ప్రపంచాన్ని యానిమేషన్ రూపంలో ప్రేక్షకులకు అందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫౌజీ, స్పిరిట్‌తో పాటు బాహుబలి యానిమేషన్ చిత్రం కూడా విడుదలైతే.. 2027లో ప్రభాస్ నుంచి అభిమానులకు మూడు సినిమాల ట్రిపుల్ ట్రీట్ దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2’ సెట్స్‌పై ఉంది. మరోవైపు ‘సలార్ 2’ షూటింగ్ వచ్చే ఏడాది జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల వెల్లడించారు. ఈ రెండు సినిమాలు కూడా ప్రభాస్ కెరీర్లో కీలకమైన ప్రాజెక్టులుగా నిలవనున్నాయి. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది కొత్త ప్రాజెక్టులపై ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
-
New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
-
Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
-
Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!