Home
Box Office Collections
Box Office Collections News
-
Ramayana : బాక్సాఫీస్‌పై ‘రామాయణ’ దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!
భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా బాక్సాఫీస్ వద్ద రామాయణ న విశ్వరూపాన్ని చూపిస్తోంది. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ రామాయణ విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ, కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1,437.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు తిరుగులేని రికార్డులుగా భావించిన పాన్-ఇండియా బ్లాక్బస్టర్ల ఆల్-టైమ్ వసూళ్లను కేవలం రెండు వారాల్లోపే తుడిచిపెట్టేసింది. రణబీర్ కపూర్,… -
Bollywood : ఒకవైపు రణ్వీర్ సింగ్, మరోవైపు రణ్‌బీర్ కపూర్.. స్టార్ పవరా? సీక్వెల్స్ క్రేజా?
ఒకప్పుడు ఖాన్ త్రయం బాలీవుడ్‌ను ఏలితే, ఈ ఇయర్ మాత్రం రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ ఇద్దరూ బాక్స్ ఆఫీస్ పై ఆధిపత్యం చూపించారు. ‘ధురంధర్ 2’ తో రణ్వీర్ సింగ్ ఏకంగా 1800 కోట్ల మార్కును దాటేస్తే, ‘రామాయణ’తో రణ్‌బీర్ కపూర్ 1000 కోట్ల క్లబ్‌లోకి దూసుకొచ్చాడు. భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాల్లో కథాబలం కన్నా దేశభక్తి, మతపరమైన భావోద్వేగాలు, భారీ విజువల్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఒక సినిమా సీక్వెల్ క్రేజ్‌తో పరుగులు… -
Ramayana Box Office Collections: ‘రామాయణ’ రికార్డుల వేట.. ‘ధురంధర్ 2’ మరో రికార్డు బద్దలు!
Ramayana vs Dhurandhar 2 Collections: నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన తొలి వారంతో పోలిస్తే.. రెండో వారాంతంలో భారీ వసూళ్లు నమోదు చేసింది. ఇప్పటికే విడుదలైన ఎనిమిదో రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల వసూళ్ల మైలురాయిని అందుకున్న రామాయణ.. 11వ రోజు నాటికి ఏకంగా రూ.1,384.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్త వసూళ్లలో బిగ్గెస్ట్… -
Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
Dhurandhar 2 vs Ramayana Second Friday Collections: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్ మూవీస్ మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ‘ధురంధర్ 2’, ‘రామాయణ: పార్ట్-1’ సినిమాలు వసూళ్ల విషయంలో రికార్డులు బద్దలవుతున్నాయి. రెండో శుక్రవారం హిందీ నెట్ కలెక్షన్లలో ఈ రెండు చిత్రాల మధ్య హోరాహోరీ పోటీ కనిపించింది. గణాంకాల ప్రకారం.. ధురంధర్ 2 రూ.37 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, రామాయణ రూ.36.25 కోట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. కేవలం రూ.75 లక్షల… -
Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
75 ఏళ్ల హీరో రజినీకాంత్ తమిళ సినిమాను 800 కోట్ల జాబితాలో చేర్చాడు. ‘బాషా’ నుంచే ఈ రికార్డుల పరంపర మొదలైంది. 25 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా ‘బాషా’ నిలిచింది. ‘చంద్రముఖి’ 75 కోట్లు, ‘శివాజీ’తో 100 కోట్లు ఎలా ఉంటాయో బాక్సాఫీస్‌కు చూపించాయి. (50 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ రికార్డ్ మాత్రం ‘భారతీయుడు’ పేరు మీద ఉంది). 100 కోట్లు ఎలా ఉంటుందో ‘శివాజీ’తో చూపించిన రజినీకాంత్, ఆ తర్వాత… -
Aadarsha Kutumbam : మూడు రోజుల్లో 75 కోట్లు.. నిర్మాతల అధికారిక ప్రకటన
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విక్టరీ వెంకటేష్ మళ్ళీ తన మార్క్ చూపించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ (AK-47: హౌస్ నెం.47) సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంటూ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా ఫ్యామిలీ సినిమాలకు కలెక్షన్లు నిలకడగా వస్తుంటాయి. కానీ వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’ మాత్రం మాస్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో కేవలం… -
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్.. ఫోటోలు ఇస్తే కలెక్షన్లు వస్తాయా?
Tollywood: టాలీవుడ్లో ప్రమోషన్ల రూట్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు సినిమా పూర్తవగానే ప్రెస్‌మీట్ పెట్టేవాళ్లు.. రిలీజ్‌కు ముందు ఆడియో ఫంక్షన్ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి నాలుగు డైలాగులు కొట్టి చేతులు దులుపుకునేవాళ్లు. కానీ ఇప్పుడు కొత్తగా ‘ఫ్యాన్స్ మీట్’ల పేరుతో సరికొత్త కల్చర్ మొదలైంది. సినిమా థియేటర్లలోకి రావడానికి నాలుగైదు రోజుల ముందు హడావుడిగా వేలాది మందిని పిలిపించి.. వరుసగా నిలబెట్టి ఫోటోలు దిగడమే ఇప్పుడు టాలీవుడ్లో నయా ట్రెండ్‌గా మారింది. అయితే… -
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా ఏంటో ‘జైలర్’ సినిమాతోనే మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు అదే నెల్సన్ దిలీప్‌కుమార్ – రజనీకాంత్ కాంబోలో వచ్చిన ‘జైలర్ 2’ తెలుగు రాష్ట్రాల్లో బాగా పర్ఫాం చేస్తోంది. అయితే, ఈ సినిమా హక్కుల కోసం వెచ్చించిన భారీ మొత్తాన్ని చూసి మొదట డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారట! కానీ, రజనీ మేనియా ముందు ఆ భయాలన్నీ పటాపంచలయ్యాయని, పెట్టిన భారీ రిస్క్ వర్కౌట్ అయిందని ప్రముఖ నిర్మాత,… -
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
Indian Cinema: ఒకప్పుడు సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు అంటేనే ఇండస్ట్రీ ఆశ్చర్యపోయేది. కానీ పాన్-ఇండియా సునామీ మొదలయ్యాక లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు రూ. 500 కోట్లు కనీస ప్రామాణికంగా మారిపోగా, రాబోయే ప్రాజెక్టులు రూ. 1000 కోట్ల నుంచి ఏకంగా రూ. 4000 కోట్ల మైలురాళ్లను టార్గెట్ చేస్తున్నాయి. ఆడియన్స్‌కు విజువల్ వండర్స్ అందించాలన్న దర్శకుల ఫాంటసీ, ప్యాషన్ ప్రొడ్యూసర్లకు తలకు మించిన భారంగా మారుతున్నా బడా నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం… -
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
Tollywood Box Office: జూలై, ఆగస్టు నెలల్లో వరుస సక్సెస్‌లతో కళకళలాడిన టాలీవుడ్ బాక్సాఫీస్‌కు సెప్టెంబర్ నెల గట్టి షాకిచ్చింది. ఆ రెండు నెలల్లో దాదాపు అరడజను చిత్రాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడంతో ఈ జోరు మునుముందు కూడా కొనసాగుతుందని అంతా భావించారు. అయితే సెప్టెంబర్ నెల టాలీవుడ్ సక్సెస్ రేటును ఒక్కసారిగా మళ్లీ మొదటికే తీసుకొచ్చింది. ఈ నెలలో రిలీజ్ అయిన స్ట్రైట్ తెలుగు సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద క్లిక్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Ajit Doval: అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!