US Plane Crash: భయంతో అరిచిన పైలట్.. క్షణాల్లో కుప్పకూలిన విమానం.. వెలుగులోకి చివరి క్షణాలు.!
- అమెరికా ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం..
- కుప్పకూలిన లియర్‌జెట్ 60, 9 మంది దుర్మరణం..
- మహిళా పైలట్ చివరి క్షణాలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Plane Crash: అమెరికా ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆదివారం గ్రీన్ఏకర్స్లోని నివాస ప్రాంతంలో లియర్‌జెట్ 60 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 09 మంది మరణించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం, లియర్‌జెట్ 60 విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి బహామాస్‌లోని నార్త్ ఎల్యూథెరాకు వెళ్తోంది. విమానం 35,000 అడుగుల ఎత్తులో విమానంపై మంచు పేరుకుపోవడం, ఎయిర్ టర్బులెన్స్ కారణంగా ప్రమాదానికి కారణమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అంతకుముందు పైలట్లు మంచు పేరుకుపోతున్న విషయాన్ని గమనించినప్పటికీ, పరిస్థితి అదుపులోనే ఉందని కంట్రోలర్లకు తెలిపారు. అయితే, వర్షపాతం ఉన్న ప్రాంతంలోకి విమానం ప్రవేశించిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయ.
వాతావరణంగా బాగా లేకపోవడంతో 35,000 అడుగుల నుంచి మరో 2000 అడుగుల ఎత్తుకు వెళ్లేందుకు పైలట్లు అనుమతి కోరారు. విమానం సుమారు 41,000 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా వేగంగా కిందికి దిగడం ప్రారంభించింది. మొదట నిమిషానికి 10,000 అడుగుల వేగంతో దిగిన విమానం, ఆ తర్వాత నిమిషానికి 20,000 అడుగులు, చివరకు 30,000 అడుగుల వేగంతో వచ్చి నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం అగ్నిగోళంగా మారింది. కూలిన ప్రాంతంలో పెద్ద గుంత తప్పా ఏమి లేదు.
Also Read
- LA Wildfires: కార్చిచ్చు..! ప్రమాదంలో 70లక్షల ప్రాణాలు..
- Florida Plane Crash: ఫ్లోరిడాలో కుప్పకూలిన బిజినెస్ జెట్.. 9 మంది దుర్మరణం
- NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!
- Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
పైలట్ చివరి క్షణాలు వైరల్..
విమానం కూలిపోతున్న సమయంలో పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ATC)తో జరిపిన సంభాషణలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘‘మనం ఇక సమయం కోల్పోయే పరిస్థితిలో లేము’’ అని విమానంలోని మహిళా సిబ్బంది అరిచినట్లు ఏటీసీ ఆడియోలో వినిపించింది. అంతకుముందు పైలట్ ‘‘ మేము 8,000 అడుగుల వేగంతో దిగుతున్నాం. మేడే, మేడే నిమిషానికి 10,000 అడుగుల వేగంతో కిందికి దిగుతున్నాం’’ అని ఎమర్జెన్సీ సందేశాన్ని పంచించారు.
పరిస్థితి విషమించడంతో ‘‘మేము ఓవర్‌స్పీడ్ పరిస్థితిలో ఉన్నాం. నిమిషానికి 20,000 అడుగుల వేగంతో దిగుతున్నాం. నేలను ఢీకొట్టబోతున్నాం’’ అని పైలట్ అనడం రికార్డ్ అయింది. విమానాన్ని నియంత్రించేందుకు , వారికి సహకరించేందుకు ఏటీసీ చివరి వరకు సంప్రదింపులు కొనసాగించింది. ‘‘నవంబర్ టూ బ్రావో డెల్టా.. నేను మీతోనే ఉన్నాను.. మాట్లాడండి’’ కంట్రోలర్ స్పందించారు. దీనికి పైలట్ ‘‘మేము 22,000 అడుగుల వేగంతో దిగుతున్నాం.. 60 డిగ్రీల కోణంలో తిరుగుతున్నాం.. నియంత్రణ కోల్పోతున్నాం’’ అన సమాధానమిచ్చారు. చివరకు విమానం కుప్పకూలడంతో ఈ సంభాషణలు ఆగిపోయాయి.
CHILLING AUDIO captures FEMALE PILOT’S FINAL MOMENTS before PLANE CRASHES in FLORIDA
‘MAYDAY, MAYDAY, we’re descending 10,000 FEET PER MINUTE’
‘LOOK OUTSIDE JACK… HOLY FU*K WE’RE OUT OF TIME’ — TERRIFYING final words heard before impact https://t.co/AaHiQRI69N
— RT (@RT_com) November 1, 2026
తాజావార్తలు
-
US Plane Crash: భయంతో అరిచిన పైలట్.. క్షణాల్లో కుప్పకూలిన విమానం.. వెలుగులోకి చివరి క్షణాలు.!
-
Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
-
CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!