ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
- హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీ
- తొలిసారి టైటిల్‌ను గెలుచుకున్న ఆఫ్ఘనిస్థాన్..
- ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్ ఐదు వికెట్లతో విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan Win Hong Kong Sixes 2026 Title: హాంకాంగ్ సిక్సెస్ (Hong Kong Sixes) 2026 టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఆఫ్ఘన్ జట్టు తొలిసారి ఈ టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గుల్బదిన్ నయీబ్ నాయకత్వంలో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. హాంకాంగ్‌లోని మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఫైనల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయగా, ఆరు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఓపెనర్ మ్యాక్స్ బ్రయంట్ కేవలం 14 బంతుల్లో 44 పరుగులతో చెలరేగాడు. అతనికి తోడుగా అలెక్స్ రాస్ 10 బంతుల్లో అజేయంగా 29 పరుగులు చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ ముందు 116 పరుగుల లక్ష్యం నిలిచింది. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్‌కు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో ఎదురుదెబ్బ తగిలింది.
Also Read
- Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
- Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
- మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
- Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు 'మనమిత్ర' అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
ఆ సమయంలో ఇమ్రాన్ మీర్, ఫర్మానుల్లా సఫీ సంచలన బ్యాటింగ్ తో జట్టును విజయపథంలో నడిపించారు. ఇమ్రాన్ మీర్ కేవలం 14 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. ఫర్మానుల్లా సఫీ 7 బంతుల్లో 4 సిక్సర్లతో 26 పరుగులు సాధించాడు. కెప్టెన్ గుల్బదిన్ నయీబ్ కూడా 6 బంతుల్లో 17 పరుగులు చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ 5.1 ఓవర్లలోనే 5 వికెట్లు, ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీనితో తొలిసారి టైటిల్‌ను అందుకుంది.
That’s a wrap on an unforgettable Hong Kong Sixes 2026! 🏆🏏
#TurnItUpToSix #HongKongSixes #M品牌活動#大型體育活動事務委員會#政府資助計劃 #MMarkEvents #MajorSportsEventsCommittee https://t.co/Ip9mrLk5l3
— Cricket Hong Kong, China (@CricketHK) November 1, 2026
మరోవైపు ఈ టోర్నీలో భారత జట్టు నిరాశపరిచింది. గ్రూప్-C లో పాకిస్థాన్, యూఏఈ చేతిలో ఓడిపోవడంతో టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత బౌల్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలోనూ పరాజయం పాలైంది. చివరగా 11వ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు చేతిలో ఉండగానే ఛేదించింది. దీంతో భారత్ 11వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ 12వ స్థానంతో టోర్నీని ముగించింది.
Great journeys deserve moments like these 🏆🇦🇫
#TurnItUpToSix #HongKongSixes #M品牌活動#大型體育活動事務委員會#政府資助計劃 #MMarkEvents #MajorSportsEventsCommittee https://t.co/SEAz1JjlnA
— Cricket Hong Kong, China (@CricketHK) November 1, 2026
Afghanistan pulls off a sensational chase to win the Grand Final by 4 wickets 🏆
#TurnItUpToSix #HongKongSixes #M品牌活動#大型體育活動事務委員會#政府資助計劃 #MMarkEvents #MajorSportsEventsCommittee https://t.co/kINbc997tZ
— Cricket Hong Kong, China (@CricketHK) November 1, 2026
తాజావార్తలు
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
-
New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
-
Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
-
Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!