విజయ దేవరకొండ కథానాయకుడిగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ అనే శక్తివంతమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. టైటిల్ తో పాటు బుధవారం నాడు టీజర్ ను కూడా ఆవిష్కరించారు నిర్మాతలు. ‘కింగ్‌డమ్’ టీజర్ అద్భుతంగా ఉంది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే యాక్షన్ డ్రామాగా ‘కింగ్‌డమ్’ రూపొందుతోందని టీజర్ తో స్పష్టం చేశారు. ఈ ఇంటెన్స్ టీజర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
Annual Income: మధ్యతరగతి వార్షిక ఆదాయం ఎంత?.. మీ స్థాయి చెక్ చేసుకోండి..
వీడీ 12 సినిమా మొదలైనప్పటి నుంచి ఈ సినిమా అవుట్ పుట్ ఓ రేంజ్‌లో వస్తుందని ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతునే ఉంది. చిత్ర యూనిట్ కూడా.. విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి మాసివ్ సినిమా చేస్తున్నట్టుగా చెబుతూ వస్తోంది. ముఖ్యంగా నిర్మాత నాగవంశీ రౌడీ ఫ్యాన్స్‌కు ఇస్తున్న హై మాత్రం మామూలుగా లేదు. అందుకు తగ్గట్టే.. ఇప్పటి వరకు బయటికొచ్చిన విజయ్ లుక్స్ అదిరిపోయాయి. ఊరమాస్ లుక్‌లో కనిపించాడు విజయ్. ఖచ్చితంగా ఈ సినిమాతో రౌడీ సాలిడ్ కంబ్యాక్ అవ్వడం గ్యారెంటీ అని.. ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా వీడీ 12 టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ‘కింగ్‌డమ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టీజర్‌కు తమిళ్‌లో సూర్య, హిందీలో రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఇవ్వగా.. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు. ముందు నుంచి చెబుతున్నట్టుగానే.. ఈ టీజర్ అదిరిపోయింది.
ఒక నిమిషం 55 సెకన్ల నిడివితో వచ్చిన ఈ టీజర్.. విజయ్ దేవరకొండ మాస్ సంభవం అనేలా ఉంది. అలసట లేని భీకర యుద్ధం.. రణ భూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్త రాజుకోసం.. అంటూ ఎన్టీఆర్ రౌడీకి ఇచ్చిన ఎలివేషన్ మాత్రం పీక్స్ అనే చెప్పాలి. చాలా పవర్ ఫుల్‌గా ఈ టీజర్‌ను కట్ చేశారు. మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా సినిమా ఉంటుందని టీజర్‌తో చెప్పేశారు. అసలు ఈ టీజర్ చూస్తే.. జెర్సీ సినిమా దర్శకుడి సినిమానేనా అని అనిపించక మానదు. విజయ్ మాస్ లుక్ మాత్రం ఊరమాస్ అనేలా ఉంది. అసవరమైతే.. మొత్తం తగలబెట్టేస్తా అని విజయ్ చెప్పిన డైలాగ్‌తో టీజర్‌ను ఎండ్ చేశారు. ఊహించినట్టే అనిరుధ్ తనదైన మ్యూజిక్‌తో ఇరగదీశాడు. ఇక ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 30న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మొత్తంగా.. కింగ్‌డమ్ టీజర్ మాత్రం సినిమా పై అంచనాలను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది. 2025, మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ‘కింగ్‌డమ్’ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విడుదల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించి, ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.