సద్దుమణిగింది అనుకుంటున్న అల్లు వర్సెస్ మెగా కాంపౌండ్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చిందని కొత్త ప్రచారం మొదలైంది. తాజాగా రామ్ చరణ్ తేజ తన బావ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినట్లు ప్రచారం మొదలైంది. అయితే అది నిజం కాదని సమాచారం. అసలు ముందు నుంచి అల్లు అర్జున్ రామ్ చరణ్ ను, రామ్ చరణ్ అల్లు అర్జున్ ను ఫాలో అవ్వడం లేదు. ఇప్పుడు కొత్తగా అన్ ఫాలో చేయడం అనేది ఎవరో కావాలనే తెర మీదకు తెచ్చిన అంశం అని తెలుస్తోంది. నిజానికి గత కొన్ని సంవత్సరాల నుంచి అల్లు కాంపౌండ్ వర్సెస్ మెగా కాంపౌండ్ అనే చర్చలు జరుగుతున్నాయి.
Prudhvi Raj: వైసీపీ అభిమానులపై ల’కారాలతో రెచ్చిపోయిన పృథ్వి రాజ్
ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా సినిమాలు చేసుకోవడంతో పాటు ఒకరి మీద ఒకరు ఇన్ డైరెక్ట్ గా పంచులు వేసుకోవడంతో అనేక చర్చలు జరిగాయి. అయితే వాటికి పుల్ స్టాప్ పెట్టేలా ఇటీవల ఒక ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి పుష్ప 2 సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపించగా ఆ తర్వాత జరిగిన ఒక ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ తనకు రామ్ చరణ్ కుమారుడు లాంటి వాడంటూ పేర్కొన్నారు. తమ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని రెండు కాంపౌండ్స్ నుంచి ప్రకటించే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. దీంతో ఇక ఈ వ్యవహారం సద్దుమణిగింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఈ అన్ ఫాలో ట్రెండ్ గురించి వార్తలు రావడం హాట్ టాపిక్ అవుతుంది.