బేబీ జాన్ అంటూ క్రిస్మస్ బరిలో దిగిన బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ ఎట్టకేలకు తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. స్టార్ హీరోయిన్లతో మిస్ బిహేవియర్‌పై తనను సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్న నెటిజన్లకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. వరుణ్ ధావన్ సినిమాలతోనే కాదు, అప్పుడప్పుడు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటాడు. హీరోయిన్లతో క్లోజ్‌గా ఉంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రీసెంట్లీ కూడా బేబీ జాన్ ప్రమోషన్ల సమయంలో కూడా హీరోయిన్లు కీర్తి సురేష్, వామికా గబ్బీలతో ఓవర్‌గా బిహేవ్ చేస్తూ అవసరమా అనిపించేట్లు బిహేవ్ చేశాడు. ఇప్పుడే కాదు గతంలో కూడా స్టార్ హీరోయిన్లు అలియా భట్‌ను అసభ్యకరంగా తాకడం, కియారా అద్వానీని అందరిలో ముద్దు పెట్టుకోవడంతో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో అతడిపై కాస్తంత నెగిటివిటీ నెలకొంది.
Also Read : Pushpa – 2 : నేపాల్ లో కూడా జెండా ఎగరేసిన పుష్పరాజ్
అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు హీరో శుభంకర్ మిశ్రా పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన వరుణ్ ‘నేను నా కో యాక్టర్స్ అందరితో ఓకేలా ఉంటా. సరదాగా ఉండటం నాకో అలవాటు. నేనెవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు, నేను అందరి ముందు కియారాను కిస్ చేయలేదు. ఓ మ్యాగజైన్ ఫోటో కోసం ఇలా చేశాం. ఆ ఫోటోని నాతో పాటు కియారా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదంతా ఇద్దరం అనుకుని చేసింది. దాన్ని ఎలా తప్పుబడతారు అంటూ తిరిగి ప్రశ్నించాడు వరుణ్ ధావన్. ఇక ఆలియా గురించి మాట్లాడూతూ ఆమె నాకు మంచి స్నేహితురాలు. సరాదాగా అలా చేశానంతే కావాలని చేయలేదు. అది సరసం కాదు. ఇప్పటికీ మేం మంచి స్నేహితులమే అంటూ తన తప్పు ఏమీ లేదన్నట్లుగా కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు.