బేబీ జాన్ అంటూ క్రిస్మస్ బరిలో దిగిన బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ ఎట్టకేలకు తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. స్టార్ హీరోయిన్లతో మిస్ బిహేవియర్‌పై తనను సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్న నెటిజన్లకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. వరుణ్ ధావన్ సినిమాలతోనే కాదు, అప్పుడప్పుడు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటాడు. హీరోయిన్లతో క్లోజ్‌గా ఉంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రీసెంట్లీ కూడా బేబీ జాన్ ప్రమోషన్ల సమయంలో కూడా హీరోయిన్లు కీర్తి సురేష్, వామికా గబ్బీలతో ఓవర్‌గా బిహేవ్ చేస్తూ…