మున్నా సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి ఎన్టీఆర్, మహేశ్, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు అందించాడు. కానీ ఎందుకనో చక చక సినిమాలు చేయడంలో వంశీ పైడిపల్లి కాస్త వెనకపడ్డాడు అనే చెప్పాలి. వంశీ చివరి సినిమా వారసుడు రిలీజ్ అయి వచ్చే సంక్రాంతి నాటికి రెండుళ్లు ఫినిష్ అవుతుంది. కానీ ఇప్పటికి మరో సినిమా పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు.
తాజగా వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే వంశీ పైడిపల్లి తన కథతో అమీర్ ఖాన్‌ని మెప్పించగలడా అనే సందేహం టాలీవుడ్ సిర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్, లాల్ సింగ్ చద్దా వంటి భారీ డిజాస్టర్స్ తో చాలా కాలంగా సినిమాలు గ్యాప్ ఇచ్చాడు అమిర్. ఇప్పుడు ఈ బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ తో సినిమా చేయాలనే టార్గెట్ గా వంశీ పైడిపల్లి ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సాధారణంగా, అమీర్ ఖాన్ తన సినిమా స్క్రిప్ట్‌ల గురించి చాలా జాగ్రట్ట వహిస్తాడు, ఏ మాత్రం అటు ఇటు ఉన్న కూడా నో చెప్తాడు అని టాక్ బాలీవుడ్ లో వినిపిస్తుంటుంది. మరి వంశీ పైడిపల్లి తన కథతో అమీర్ ఖాన్‌ని ఇంప్రెస్ చేయగలరా అనే చర్చ నడుస్తోంది. వంశీ చెప్పిన కథ నచ్చి అన్ని సెట్ అయితే ఈ సినిమాను కూడా తన రెగ్యులర్ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లోనే ఈసినిమా రానుంది.