ఇటీవల, ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ లైవ్ కన్సర్ట్ లో పలువురు మహిళా అభిమానులను ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆయన్ని నెటిజన్లు ఒక రేంజ్ లో టార్గెట్ చేసి ఆడుకుంటున్నారు. లైవ్ కన్సర్ట్ లో ‘టిప్ టిప్ బర్సా పానీ’ అనే హిట్ పాట పాడుతున్న సమయంలో అభిమానులు సెల్ఫీలు దిగేందుకు వేదికపైకి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. దానికి తోడు ఒక మహిళా అభిమాని ఉదిత్ నారాయణ్ తో సెల్ఫీ దిగేందుకు రాగా ఆమె చెంపపై ముద్దు పెట్టాడు, ఆ తరువాత ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. దీనిపై ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో దీనిపై నారాయణ్ స్పందిస్తూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అభిమానులంటే నాకు చాలా పిచ్చి అని అన్నారు. మేం నాగరికత ఉన్నవాళ్లం. అలా ముద్దు పెట్టడం ద్వారా కొందరు తమ ప్రేమను చాటుకుంటారు.
Akhil Akkineni: అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా!
ఈ విషయాన్ని ఇలా దుష్ప్రచారం చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏమి చేయాలి? అని ప్రశ్నించారు. గుంపులో చాలా మంది ఉన్నారు, మాకు బాడీగార్డులు కూడా ఉన్నారు. కాని అభిమానులు కలిసే అవకాశం కోసం వస్తారు, కాబట్టి ఎవరైనా కరచాలనం చేయడానికి ముందుకు వస్తే నేను దగ్గరకు వెళ్తాను. అలాగే ఈ ముద్దులు కూడా జరిగాయి. వీటన్నింటిపై పెద్దగా శ్రద్ధ పెట్టకూడదు అని ఆయన అన్నారు. అభిమానులు నన్ను ప్రేమిస్తారు, వారు సంతోషంగా ఉండనివ్వండి. మనం వారిని సంతోషపెట్టాలి. నేను 46 ఏళ్లుగా బాలీవుడ్‌లో ఉన్నాను, అభిమానులను బలవంతంగా ముద్దుపెట్టుకునేలా నా ఇమేజ్ లేదు. నిజానికి, నా అభిమానులు నాపై కురిపిస్తున్న ప్రేమను చూసినప్పుడు, నేను ఈ సమయం మళ్ళీ తిరిగి వస్తుందా అని ఆశ్చర్యపోతానని ఆయన చెప్పుకొచ్చారు.