CCL 11వ సీజన్ గేమ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. సెలబ్రీటీ క్రికెట్ లీగ్ (CCL) ఫిబ్రవరి 8న బెంగళూరులో 11వ సీజన్‌ను ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో నాలుగుసార్లు ఛాంపియన్‌లుగా తమ లెగసీ కంటిన్యూని 5వ టైటిల్ గెలుపు కోసం సిద్ధమవుతున్న బలమైన జట్టు తెలుగు వారియర్స్ పై జెర్సీ లాంచ్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ క్రమంలో తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సిసిఎల్ 14 ఏళ్ల జర్నీ. గ్లింప్స్ లో చూస్తే ఓ చోట మరీ చిన్నపిల్లాడిలా కనిపించాను. సిసిఎల్ ఆడుతూ పెరిగాను. విష్ణు, సచిన్ పాషన్ తో ఇది సాధ్యపడిందని భావిస్తున్నాను.
Anirudh: నాని ‘ప్యారడైజ్’ కోసం అనిరుధ్ షాకింగ్ రెమ్యునరేషన్”?
మేము నాలుగు సార్లు టైటిల్ గెలిచాం. ఈసారి కూడా టైటిల్ కొట్టి ఐదు సార్లు ఛాంపియన్ గా నిలుస్తామనే నమ్మకం వుంది. అన్నిటికంటే అందరినీ ఎంటర్ టైన్ చేయాలనే పాషన్ తో వస్తున్నాం. 14, 15 ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం. అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము’ అన్నారు. ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ.. క్రికెట్ అనేది నా చైల్డ్ వుడ్ డ్రీం. సిసిఎల్ ఫార్మెట్ నా డ్రీంని తీర్చింది. దేశంలోని ప్రముఖ మైదానాల్లో క్రికెట్ ఆడటం ఓ అదృష్టం. అఖిల్ అగ్రెసివ్ కెప్టన్. తన ఎత్తుగడలు అద్భుతంగా ఉంటాయి. తనలో చాలా ఫైర్ వుంది. క్రికెట్ మాకు చాలా ఎనర్జీ ఇస్తోంది. మాది చాలా క్రేజీ టీం. సచిన్ టీంకి ఓనర్ తో పాటు ఆటగాడిగా బిగ్గెస్ట్ స్ట్రెంత్. మూడు నెలలుగా చాలా ప్రాక్టీస్ చేశాం. ఈసారి తప్పకుండా కప్ కొడతాం అన్నారు.