ఈ మధ్య చిన్న సినిమాల్లో కొత్త కథలు బాగా వస్తున్నాయి. ముఖ్యంగా వాటిలోనే ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టుక్ టుక్’ సినిమా కూడా అలాంటిదే. శాన్వి మేఘన, హర్ష్ రోషన్, నటులు కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, నిహాల్ కోధాటి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో సాగే ఈ కథలో అక్కడ సంప్రదాయాలు కూడా బాగా చూపించారు. ఓ ముగ్గురు కుర్రాళ్లు, వాళ్ళ మధ్యలో ఒక లవ్ పెయిర్, ఒక డొక్కు స్కూటర్.. అది చేసే టుక్ టుక్ సౌండ్.. అది చేసే వింతలు.. ఇలా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా కంటేంట్ దెబ్బ తినకుండా మేకర్స్ చాలా జాగ్రత్త పడ్డారు. ఇక తాజాగా OTT లో విడుదలైన ఈ చిత్రం ధూమ్ములేపుతోంది..
Also Read: Sreeleela : శ్రీలీల ఆశలపై నీళ్లు చల్లిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’..!
ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చిన ఈ సినిమా కెవలం మౌత్ టాక్ తో ఈ వారం అమెజాన్ ట్రెండింగ్‌లో నంబర్ 3 స్థానాన్ని సంపాదించి, అంతే కాదు, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 100 మిలియన్‌కు పైగా వ్యూస్ రాబట్టి ఆశ్చర్యం కలిగించింది . ఇది చిన్న సినిమాకు పెద్ద గౌరవం అనే చెప్పాలి. వీక్షకులు ఈ సినిమాను ఆదరించడమే కాకుండా, ప్రతి క్యారెక్టర్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో పెద్ద స్టార్ క్యాస్ట్ లేదు. భారీ బడ్జెట్ లేదు. కానీ స్నేహితుల కృషి, కొత్త దృక్పథం, మనసుకు హత్తుకునే కథ, ప్రేక్షకుల హృదయాలను తాకింది. మంచి కంటెంట్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటుందనే విషయాన్ని.ఈ చిత్రం విజయంతో మరో సారి నిరూపితం అయ్యింది.