‘ధమాకా’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌తో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న బ్యూటీ శ్రీలీల. దీంతో వరుస ఛాన్సులు కొల్లగొడుతూ.. తన తోటి భామలకు గట్టి ఝలక్ ఇచ్చింది. ఇక నక్క తోక తొక్కానని సంబరపడి పోయేలోపు ప్లాపులు వచ్చి.. మేడమ్ ఇమేజ్‌ను కాస్త డ్యామేజ్ చేశాయి. ఆదే టైంమ్‌లో సైన్ చేసిన మూవీనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈ బొమ్మ కోసం ఈగర్ లీ వెయిట్ చేస్తున్నారు.
Also Read : Disha Patani: హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్న కల్కి బ్యూటీ
ఇంకా ఎప్పుడో మొదలైన ఈ మూవీ పవన్ పొలిటికల్ జర్నీ వల్ల డిలే అవుతూ వస్తుంది. కానీ ఎట్టకేలకు మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది. జూన్ నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా కోసం శ్రీ లీల బల్క్ డేట్స్ ఇచ్చింది. ముందే అనుకున్న కమిట్మెంట్ వల్ల ఈ ప్రాజెక్టుకు షిఫ్ట్ అవుతుంది. జూన్ 10 నుండి ఈ క్వీన్ షూటింగ్‌లో పాల్గొననుందని టాక్. మరి బాలీవుడ్ సంగతేంటీ..?
Also Read : Disha Patani: హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్న కల్కి బ్యూటీ
సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీంతో మూవీ దాదాపు ఖరారు చేసుకుంది. కానీ కార్తీక్ ఆర్యన్‌తో ‘ఆషికి3’ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ మూవీ ఆల్మోస్ట్ 40 పర్సెంట్ షూటింగ్ కంప్లీటయ్యిందట. ఇప్పుడేమో ఊహించని విధంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు బల్క్ డేట్స్ ఇచ్చింది లీల. దీని వల్ల హిందీ మూవీ షూటింగ్ వాయిదా పడిందని టాక్. ఇక షూటింగ్ డిలే అయితే రిలీజ్ డేట్‌పై ఎఫెక్ట్ పడుతుంది. దీంతొ ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్ వాలంటీన్స్ డే కు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారన్నది బాలీవుడ్ లేటెస్ట్ బజ్. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్. బీటౌన్‌లో దూసుకెళ్లిపోదామనుకున్న శ్రీలీల ఊహాలకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇలా ఊహించని కళ్లెమేసింది. ఇవే కాదు.. కోలీవుడ్ ఎంట్రీ ‘పరాశక్తి’ కూడా వచ్చే ఏడాదికే దిగేలా కనిపిస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మ ఈ చిక్కులోంచి ఎలా బయట పడుతుంది చూడాలి.