కేజీఎఫ్, సలార్‌తో పాన్ ఇండియన్ స్టార్ ఐడెంటిటీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తన ఫస్ట్ హీరో శ్రీ మురళి కూడా ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చేద్దామని బఘీరకు స్టోరీ ఇచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన బఘీర 30 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇక టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టోరీతో మహేష్ బాబు అల్లుడు గల్లా అశోక్ ‘దేవకీనందన వాసుదేవ’ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇతగాడి స్టోరీలపై డౌటానుమానం వచ్చేలా చేశాడు. ఇక మరోపక్క తనకే సరైన హిట్ లేదు.. మరొకరికి కథలు ఇస్తాడు సంపత్ నంది. ఆగస్టులో రిలీజైన సింబా మూవీకి కథ ఇస్తే డిజాస్టర్ గా నిలిచింది.
Also Read : Allu Arjun : కేరళలో భారీ ఎత్తున ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్
వీరు మాత్రమే కాదు త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్ కూడా డైరెక్టర్లుగా హిట్టై.. రైటర్లుగా ఫెయిలయ్యారు. సెలబ్రిటీ దర్శకుడిగా మారిన తర్వాత.. నితిన్‌కు ఛల్ మోహన్ రంగా స్టోరీ ఇచ్చాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. కానీ చాలు ఇక అన్నారు ఆడియన్స్. కొడుకుని అర్జెంట్‌గా రొమాంటిక్ హీరో చేద్దామని రొమాంటిక్ మూవీకి లైన్ ఇస్తే రొట్ట సినిమా అని పక్కన పెట్టేసారు ఆడియెన్స్. F2తో సక్సెస్ కొట్టిన అనిల్ రావిపూడి సైతం శ్రీ విష్ణు గాలి సంపత్ మూవీకి స్క్రీన్ ప్లే ఇస్తే అది గాలికి కొట్టుకుపోయింది. ఇక హరీష్ శంకర్.. సునీల్‌ను మరోసారి హీరోగా నిలబెట్టేందుకు వేదాంతం రాఘవయ్య మూవీకి స్టోరీ ఇస్తే. ఆ మూవీ ఉందో.. లేదో కూడా తెలియదు. ఇప్పటికైనా ఈ రెండు పడవల ప్రయాణం ఆపేసి చక్కగా దర్శకత్వం చేసుకుంటే నాలుగు హిట్స్ వస్తాయి లేదంటే ఇక ఇండస్ట్రీకి రామ్ రామ్ చెప్పాల్సి ఉంటుంది.