సోషల్ మీడియాకు రాను రాను సినిమా సెలెబ్రిటీస్ దూరంగా జరుగుతున్నారు. తమకు నచ్చిన వారిపై ఎక్కడ లేని అభిమానం చూపించడం, నచ్చని వారిపై అక్కసు చూపించడం రాను రాను సోషల్ మీడియాలో పెరుగుతూ వెళ్తోంది. ఇక స్టార్ హీరోల ఫ్యాన్ వార్స్ సంగతి చెప్పక్కర్లేదు. ఈ నేపధ్యంలో అనేక మంది సినీతారలు సోషల్ మీడియాను వదిలేస్తున్నారు. అసలు రణబీర్ వంటి స్టార్ అయితే ఇప్పటికి సోషల్ మీడియా ఖాతాను తెరిచేందుకు ఇష్టపడలేదు. ఇక టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి కొద్దీ రోజుల క్రితం సోషల్ మీడియను వదిలేస్తున్నట్టు తెలిపింది.
Also Read : Mirai : మిరాయ్ దర్శకుడితో మెగాస్టార్ చిరు సినిమా.. కానీ?
ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక హీరోయిన్ వచ్చి చేరింది. మట్టి కుస్తీ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయిన ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియాను వదిలేసింది. హీరోయిన్ గా నిలబడాలంటే సోషల్ మీడియాలో కంపల్సరి అనుకున్నాను. ఈ జనరేషన్ లో సోషల్ మీడియా తప్పనిసరి అని భావించాను. కానీ అది తప్పని తెలుసుకున్నాను. నేను చేసే పని నుండి, నా ఆలోచనల నుంచి సోషల్ మీడియా నన్ను దూరం చేసింది. చివరకు నా భాషపై కూడా నెగిటివ్ ప్రభావం చూపించి నాకుండే చిన్నచిన్న సంతోషాల్ని కూడా నన్ను దూరం చేసింది. నాలోని అమ్మాయిని అలాగే నాలోని నటిని ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉండేందుకు పూర్తిగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్ల ప్రశాంతమైన జీవనంతో పాటు మంచి సినిమాలు చేస్తును’ అని ప్రకటించింది ఐశ్వర్య లక్ష్మి. తెలుగులో సాయి దుర్గ్ తేజ్ తో సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తోంది ఐశ్వర్య లక్ష్మి.