రానున్న రోజుల్లో టాలీవుడ్ లో తమిళ సినిమాలు హవా పెరగనుంది. తమిళ హీరోల సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్, సూర్య, కార్తీ సినిమాలు తెలుగులో మంచి వసూళ్లు రాబడతాయి. కథ, కధనం బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. ప్రేమలు అనే చిన్న సినిమా తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
ఇటీవల భారతీయుడు -2 తో తమిళ పెద్ద సినిమాల సందడి మొదలయింది. రూ.25 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయంటే తమిళ సినిమాలకు తెలుగులో ఎంత గిరాకీ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే నాడు విక్రమ్ నటించిన ‘తంగలాన్’ రిలీజ్ డేట్ ప్రకటించారు. ధనుష్ ‘రాయన్ ఆగస్టు 27న రానుంది. మరో స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ దసరా కానుకగా తమిళ్, తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక తమిల్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా ‘G.O.A.T’ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. విజయ్ గత చిత్రం ‘లియో’ తెలుగులో దాదాపు రూ. 47 కోట్ల గ్రాస్ రాబట్టిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు ఇక్కడ ఆరవ హీరో సినిమాల హవా ఎంత ఉంటుందో. వీటితో పాటు దీపావళి కానుకగా అక్టోబరు 31న అజిత్ విడా ముయార్చి, శివ కార్తికేయన్ ‘అమరన్’ తెలుగు లో రానున్నాయి. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చిన తెలుగు సినిమాలకంటే అత్యధిక కలెక్షన్లు తమిళ సినిమాలు రాబడతాయనడంలో రెండో మాటకు తావు లేదు.
Also Read : Sudheer Babu : ఓటీటీలో సుధీర్ బాబు చిత్రం ట్రెండింగ్..ఎక్కడంటే …?