టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా.. కెరీర్ ఆరంభంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు. వరుస అవకాశాలు అందుకున్ని దాదాపు స్టార్ హీరోలందరితో జత కట్టింది. తన నటన అందంతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న కూడా ఎక్కడ తన గ్రాఫ్ పడిపోకుండా దూసుకుపోతుంది తమన్నా. మధ్యలో కొంత టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, ఊహించని విధంగా హాట్ షోకి తెరలేపి రొమాంటిక్ యాంగిల్ చూపించింది. అలా హిందీలో కూడా మంచి మార్కెట్ సంపాదించుకుంది. ఇక చాలా కాలం తర్వాత ఇప్పుడు తెలుగులో ‘ఓదెల 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తమన్నా. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గతంలో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ కు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇక తమన్నా,హెబ్బా పటేల్, వశిష్ట సింహ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్నా ఈ మూవీ ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది.
ఇక విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తమన్నా మాట్లాడుతూ ఈ మూవీ తనకు ఎంతో స్పెషల్ అని చెప్పుకొచ్చింది.. ‘ఇప్పటివరకు నేను తీసిన సినిమాతో పోల్చితే ‘ఓదెల 2’ చిత్రం నాకు చాలా దగ్గరగా అనిపించింది. అందుకే ఈ సినిమాను ఎంతో ఇష్టంగా చేశాను. నా పాత్ర గురించి వినగానే చాలా ఆశ్చర్యం వేసింది, ఇలాంటి పాత్ర నేను చేయగలనా అనే భయం కలిగింది, కానీ ఈ సినిమా చేయాలని భగవంతుడే నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ మూవీలో నాపై వచ్చే క్లోజప్ షాట్స్ నా కెరీర్‌లోనే బెస్ట్ షాట్స్’ అని చెప్పుకొచ్చింది తమన్నా చెప్పుకొచ్చింది.