ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన 43వ సినిమా “వేదవ్యాస్”తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమైంది. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పేరుగాంచిన కృష్ణారెడ్డి, మరోసారి అలాంటి కథతోనే వస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకులు వి.వి. వినాయక్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read:Anushka Shetty : ఘాటి ప్రమోషన్స్‌కి దూరంగా అనుష్క.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ఈ చిత్రం ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, మంచి సందేశంతో కూడుకున్న కమర్షియల్ సినిమాగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం ఎస్వీ కృష్ణారెడ్డి స్వయంగా అందిస్తున్నారు. హీరోయిన్ సౌత్ కొరియా నుండి, విలన్ మంగోలియా నుండి తీసుకున్నారు. హీరో వివరాలు త్వరలో ప్రకటిస్తారు. సాయికుమార్, మురళీ మోహన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఎస్వీ కృష్ణారెడ్డి శైలిలో “వేదవ్యాస్” కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది.
ఈ చిత్రాన్ని సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆయనకు ఇది తొలి సినిమా. సినిమాపై ఉన్న మక్కువతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టానని ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ సినిమాతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ముహూర్తపు షాట్‌లో దిల్ రాజు ఆమెకు బొకే ఇచ్చి స్వాగతం పలికారు.