VD15: రౌడీ బాయ్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.
టాలీవుడ్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ అంచనాలు నెలకొన్న, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 ‘గ్లోబ్‌ట్రాటర్’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ కెన్యాలో ప్రారంభమయ్యేందుకు అంతా సిద్ధమైంది. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రియాంక చోప్రా కెన్యాకు బయలుదేరిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్త ఖరారైంది. ప్రయాణంలో ఆమె కెన్యాలో లభించే ‘కెన్యాన్ చెవ్డా’ అనే ప్రముఖ ఇండియన్ స్నాక్‌ను చూసి ఆశ్చర్యపోయినట్లు ఓ ఫొటోను షేర్ చేసింది. దీని ద్వారా ‘గ్లోబ్‌ట్రాటర్’…
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన 43వ సినిమా “వేదవ్యాస్”తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమైంది. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పేరుగాంచిన కృష్ణారెడ్డి, మరోసారి అలాంటి కథతోనే వస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకులు వి.వి. వినాయక్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. Also Read:Anushka Shetty : ఘాటి ప్రమోషన్స్‌కి దూరంగా…
గౌరి ఫిలింస్ తో కలిసి సుఖకర్త ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1గా “పెళ్లిలో పెళ్లి” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కోలి నిర్మిస్తున్న “పెళ్లిలో పెళ్లి” సినిమాకు శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. గురువారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్…
హరిహర వీరమల్లు సందడికి అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతోంది. నిజానికి ఈ వేడుకను ముందు తిరుపతి లేదా విశాఖపట్నంలో నిర్వహించాలని అనుకున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇండోర్ ఈవెంట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ, 6:30 నుంచి 7:30 మధ్యలో కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంది.…
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. హీరో సూర్య హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న కొత్త సినిమా రేపు (మే 19, 2025) ఉదయం హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటి మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.