69న నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. బెస్ట్ సినిమాగా ఆర్ ఆర్ ఆర్, బెస్ట్ హీరోగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్స్ ని గెలుచుకున్నారు. ఒకప్పుడు ప్రాబబుల్స్ లో కూడా లేని చోటు నుంచి ఇప్పుడు ఒకే ఏడాది పది నేషనల్ అవార్డ్స్ గెలిచే స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ఇదిలా ఉంటే నేషనల్ అవార్డ్స్ ని ప్రకటించిప్పటి నుంచి కోలీవుడ్ లో మా సినిమాలని అన్యాయం జరిగింది, ఈ సినిమాలకి…
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. సూర్య నటించిన జై భీమ్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తమ కులాన్ని అవమానించేలా ఉన్నాయని వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే.
సెలబ్రిటీలు ఏదో ఒక సామాజిక సేవ చేస్తూనే ఉంటారు. పేదల కోసం, పిల్లల కోసం తమకు తోచిన సాయం చేస్తూనే ఉంటారు. కొందరు ఉచితంగా వైద్యం అందిస్తుంటే..మరి కొందరు ఉచితంగా విద్య, ఆహారం కూడా అందిస్తుంటారు. రీల్ హీరోలు రియల్ హీరోలవడం అంటే ఇదే. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఆపదలో ఉన్న అనేకమందిని ఆదుకున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ హీరో కొందరు పేదలకు చేసిన సాయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. అతనెవరో…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం గతేడాది అమెజాన్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసిన లాయర్ చంద్రు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అమాయకులను, పోలీసులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక ఈ చిత్రం కేవలం సౌత్ లోనే కాకూండా భారతీయ సినిమాని గర్వించదగ్గ సినిమాగా నిలవడం విశేషం. తాజగా మరోసారి జై…
స్టార్ హీరో సూర్య పేరు ప్రతిచోటా మారుమ్రోగిపోతుంది. ‘జై భీమ్’ చిత్రంతో దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్నాడు. ‘జైభీమ్’ సినిమా కథ నిజజీవితంలో పార్వతి అనే మహిళది అని అందరికి తెలిసిందే. ఈ సినిమా తరువాత పార్వతి నిజ జీవితం గురించి పలు ఛానెళ్లు ఇంటర్వ్యూలు చేశాయి. సూర్య సైతం ఆమెకు ఆర్థిక సాయం చేశారు. ఇక తాజాగా పార్వతి ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జై భీమ్ సినిమా చూడలేదని,…
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నిలచింది. ఒక వేళ ‘జై భీమ్’ థియేటర్లలో విడుదలై ఉంటే ఎలా ఉండేదో కానీ, మొత్తానికి నెటిజన్లను ఈ సినిమా భలేగా ఆకట్టుకుంటోంది. ‘ఇంటర్నెట్ మూవీ డేటాబేస్’ వెబ్ సైట్ రేటింగ్ లో ఇప్పుడు ‘జై భీమ్’కు జనం జైకొట్టారు. అగ్రస్థానంలో నిలిపి పట్టం కట్టారు. ఈ చిత్రానికి పదికి 9.6 పాయింట్స్ లభించాయి. ఈ చిత్రాన్ని నెటిజన్స్ ఇంతగా…
లేడీ డైరెక్టర్ సుధ కొంగర, సౌత్‌లో డిఫరెంట్ కథలతో సినిమాలను ఎంచుకునే సూర్య కాంబినేషన్ మరోసారి రీపీట్ అవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ ” ఆకాశం నీ హద్దురా ” సినిమాతో సూపర్ హిట్‌తో పాటు ఎన్నో అవార్డులు సాధించారు. సుధ కొంగర మరోసారి సూర్యను డైరెక్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించిన కథ చర్చలు ఈ మధ్యనే ముగిసినట్టు సమాచారం. ఇదే జరిగితే వారి ఖాతాలో మరో భారీ హిట్టు పడటం ఖాయమంటున్నాయి…
సెలెబ్రిటీల పేర్లతో చీటింగ్ జరగడం చూస్తుంటే ఉంటాము. అయితే ఈసారి మాత్రం కేటుగాళ్లు రూటు మార్చి ఏకంగా స్టార్ హీరో నిర్మాణ సంస్థనే వాడుకున్నారు. సౌత్ ఫిల్మ్ స్టార్ సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పేరును మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ వారి సోషల్ మీడియా ఖాతాలో తమ నిర్మాణ సంస్థ పేరుతో జరిగిన మోసం గురించి షాకింగ్ వార్తను పంచుకుంది. ఒక మోసగాడు వారి లోగోతో పాటు నకిలీ ఇమెయిల్ ఐడిని సృష్టించాడు.…
మేం ట్రెండును ఫాలో అవ్వం.. సెట్ చేస్తాం.. అంటూ ఓ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగ్ చెబుతారు.. ఇది సరిగ్గా సరిపోయే వ్యక్తం ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ సీఎం, గులాబీ దళపతి కె.చంద్రశేఖర్ రావే.. తెలంగాణ రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా అయనే ట్రెండ్ సెట్టర్. అయన ఏం చేసినా వినూత్నమే… మెదట అసాధ్యం అనిపించేలా అయన పథకాలుంటాయి.. తర్వాత అందరు ఫాలో అయ్యేలా రిజల్ట్ ఉంటుంది. పరిపాలనలో అయినా రాజకీయాల్లో అయినా……