కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “ఆకాశం నీ హద్దురా”. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి ఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రముఖుల డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించారు. అపర్ణా బాలమురళి ఇందులో హీరోయిన్ గా నటించగా… ఊర్వశి, పరేష్ రావల్, మోహన్ బాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమిళంలో “శురారై పొట్రు”, తెలుగులో “ఆకాశం నీ హద్దురా” అనే టైటిల్ తో ఈ చిత్రం విడుదలైంది. నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ ను సాధించింది. భారీ కలెక్షన్లతో పాటు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అంతేనా షాంఘై ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కావడమే కాకుండా ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కోసం కూడా పరిశీలనకు వచ్చింది. ఇలా ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం సూర్య కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయింది.
Also Read : వీడియో : “విశాల్31” సెట్స్ లో మాస్ ఫైట్ సీన్
తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సాధించింది. అక్టోబర్ 30 నుంచి “ఆకాశం నీ హద్దురా” అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం ప్రైమ్ వీడియో అవార్డ్స్ 2021లో… బెస్ట్ మూవీ మీడియా కాంపెయిన్ గా గోల్డ్ ను సొంతం చేసుకుంది. ప్రేక్షకులకు అవుట్ ఆఫ్ బాక్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు, హై కన్వర్జేషన్, బజ్, వ్యూస్ తో “ఆకాశం నీ హద్దురా” చిత్రం ఈ అవార్డును సొంతం చేసుకుంది. సౌత్ లో ఈ రికార్డు క్రియేట్ చేసిన ఓందాటి హీరో సూర్యనే కావడం విశేషం.