‘రెయిన్ బో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన 34 సంవత్సరాల సోనాల్ చౌహాన్ ఆ తర్వాత ‘పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో’ వంటి చిత్రాలలో నటించింది. విశేషం ఏమంటే… ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే నందమూరి బాలకృష్ణ సరసన ఏకంగా మూడు చిత్రాలలో నటించి రికార్డ్ సృష్టించింది. బాలయ్య సరసన తొలిసారి ‘లెజెండ్’లో నటించిన సోనాల్ చౌహాన్ ఆ తర్వాత ‘డిక్టేటర్’, ‘రూలర్’లోనూ కీ-రోల్స్ ప్లే చేసింది. ఇటీవల దక్షిణాదిన మూడు రాష్ట్రాలను తుఫాన్ అతలాకుతలం చేయడం తెలిసింది. ముఖ్యంగా ముంబైలో చాలామందికి నిలువ నీడ లేకుండా పోయింది. అలానే కనీసం తినడానికి తిండి కూడా సంపాదించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని గుర్తించి, ఆ మధ్య ఊర్వశీ రౌతేలా నిత్యావసరాలు ఇచ్చి, సాయం చేసినట్టుగానే ఇప్పుడు సోనాల్ చౌహాన్ తన పెద్ద మనసును చాటుకుంది. జుహూ సమీపంలోని శనిదేవ్ గుడి ప్రాంతంలోని బీదవారికి ఆహారాన్ని సోనాల్ స్వయంగా అందించింది. అందమైన సోనాల్ కు అందమైన మనసు కూడా ఉందంటూ అక్కడి వారు ఆశీర్వదించారట.