ఎన్ని సార్లు చూసిన మళ్ళి మళ్ళి చూడాలి అనిపించే చిత్రాలు కొన్ని ఉంటాయి. ఇందులో దర్శకుడు శేకర్ కమ్ముల మూవీస్ అధిక సంఖ్యలో ఉంటాయి. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, హ్యాపీడేస్, ఆవకాయ బిర్యాని, ఫిదా .. ఇలా మంచి మంచి కథలు అందించాడు శేకర్ కమ్ముల. అయితే ఈ మూవీస్ లో ‘హ్యాపీడేస్’ మూవీ చూస్తే ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. దాదాపు 17 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2017లో విడుదలైన భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాక, అప్పటి యువతరానికి ఉర్రూతలూగించింది. అయితే ఈ మూవీ ఈ శుక్రవారం రీరిలీజ్ కానుంది. అలాగా దర్శకుడిగా శేఖర్ కమ్ముల కూడా ఇండస్ట్రీలో 24ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మీడియాతో ముచ్చటించారు.
Also Read: Tamannaah : ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం
‘ కాలేజీ జీవితం అంటే అల్లరి చిల్లరి పనులు చేయడం, అమ్మాయిల్ని ప్రేమలో పడేయడం తరహా సన్నివేశాలు కాకుండా ‘హ్యాపీడేస్’ లో ఓ ప్రత్యేకమైన జీవితాన్ని తెరపై చూపించాం. ప్రేక్షకులకు నచ్చింది కూడా అదే! అందుకే ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. వచ్చే ఏడాది చిత్రోత్సవాల్లో నా ఎడాలర్ డ్రీమ్స్ ప్రదర్శిస్తే బాగుంటుంది. నేటి సాంకేతిక హంగుల్ని జోడిస్తే అది ఇంకా బాగా కనెక్ట్ అవుతుందని నా నమ్మకం. ఏ సినిమా చేసినా చెడు చెప్పకుండా విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి సినిమాలు చేశా, డబ్బు, పేరు కోసం ఈ రంగంలోకి రాలేదు. వేగంగా సినిమాలు తీయడం కంటే గుర్తుండిపోయే సినిమాలు తీయాలి అనేది నా సిద్ధాంతం. ప్రజంట్ జనాలను ఎంటర్ టైన్ చేయడానికి సోషల్ మీడియా ఉంది. కానీ ఇలా వీటన్నిటినీ కాదని ఇంకేదో కొత్తగా చెప్పాలనేదే నా ప్రయత్నం.అందుకే కథలు రాసుకుని, ఆ తర్వాత వాటిని ఎవరితో తీస్తే బాగుంటుందో ఆలోచించి వాళ్లని సంప్రదిస్తుంటా. స్టార్స్ కి తగ్గట్టుగా ప్రపంచాన్ని సృష్టించి వినోదం పంపడం కొంతమంది దర్శకుల బలం, ఇప్పుడు సినిమా తీయడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఆ డబ్బును తిరిగి రాబట్టాలంటే కాంబినేషన్లు కావాల్సిందే! నా శైలి అందుకు భిన్నంగా ఉంటుంది, ‘కుబేర’ కథ ధనుష్ నాగార్జున, రష్మికలని కోరుకుంది. అందుకే వారిని సంప్రదించా. ఆ సినిమా తీసినందుకు గర్వపడుతున్నా. తెరపైన ఈ సినిమా చూసి ప్రేక్షకులు వావ్.. అంటారని నా నమ్మకం’ అని తెలిపాడు.