తెలుగు చిత్ర పరిశ్రమలో శివలెంక కృష్ణప్రసాద్ – దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ బాగా సుపరిచితం. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి హిట్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన మూడో సినిమా ‘సారంగపాణి జాతకం’. ఈ చిత్రంలో ప్రియదర్శి కథానాయకుడిగా నటించగా, వేసవి కాలంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 18, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ‘సారంగపాణి జాతకం’లో ప్రియదర్శి సరసన తెలుగు నటి రూప కొడువాయూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ ‘సారంగో సారంగా’ మరియు ‘సంచారి సంచారీ’ పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారాయి. అలాగే, టీజర్‌లోని హాస్య సన్నివేశాలు, సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Mitraaw Sharma: బ్యాంకాక్ పారిపోయిన హర్షసాయి.. మిత్రాశర్మ సంచలనం!
ఈ సినిమా గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, “‘సారంగపాణి జాతకం’ ఫస్ట్ కాపీ సహా పూర్తిగా సిద్ధమైంది. త్వరలో సెన్సార్ ప్రక్రియను పూర్తి చేస్తాం. ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. వేసవిలో కుటుంబంతో కలిసి ఆనందించేలా ఈ సినిమా ఉంటుంది. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతంగా రూపొందించారు. టీజర్ ద్వారా ‘సారంగపాణి’ ప్రపంచం ఎలా ఉంటుందో చూపించాం. ఇది అందరినీ నవ్వులతో ముంచెత్తే వినోదాత్మక చిత్రం” అని తెలిపారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటిస్తుండగా, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘సారంగపాణి జాతకం’ వేసవి సీజన్‌లో ప్రేక్షకులకు హాయిగా నవ్వులు పంచేందుకు సిద్ధంగా ఉంది!