“ఆర్ఆర్ఆర్” సినిమా నుంచి విడుదలైన “దోస్తీ” సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్రెండ్‌షిప్ డే రోజున సినిమా నుంచి మొదటి సింగిల్ ‘దోస్తీ’ని విడుదల చేశారు. 5 భాషల్లో, ఐదుగురు ప్రముఖ సింగర్స్ పాడిన ఈ సాంగ్ విజువల్స్, కీరవాణి అందించిన మ్యూజిక్, లిరిక్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మేకర్స్ ఈ స్పెషల్ వీడియో సాంగ్ కోసం ఏకంగా రూ.3 కోట్లు ఖర్చు చేశారు. ఈ సాంగ్ లో చివరిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ చేతులు కలపడంతో అభిమానులు, ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. ఈ పాటకు మరో వెర్షన్ ఉందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమైన ప్రముఖ నటులు, సాంకేతిక నిపుణులతో ఈ సాంగ్ ఇతర వెర్షన్ చిత్రీకరించబడుతుంది. ఈ వెర్షన్ సాంగ్ చిత్రం ముగిసాక టైటిల్ కార్డుల సమయంలో ఉపయోగించబడుతుంది.
Read Also : నాగార్జున, ప్రవీణ్ సత్తారు మూవీ షూటింగ్ ఎప్పుడంటే ?
సినిమా విషయానికి వస్తే… “దోస్తీ” పాట సినిమా మొత్తంలో పలు ఎపిసోడ్‌లకు ఉపయోగించబడుతుంది. మేకర్స్ ప్రస్తుతం సినిమాలోని ఇతర సింగిల్స్ విడుదల చేయడానికి వినూత్న ప్రమోషన్‌ల రూపకల్పనలో బిజీగా ఉన్నారు. “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాల కోసం భారీ బడ్జెట్ కేటాయించబడింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాటను పూర్తి చేయడానికి “ఆర్ఆర్ఆర్” బృందం యూరప్ వెళ్లింది. శరవేగంగా జరుగుతున్న “ఆర్ఆర్ఆర్” పోస్ట్ ప్రొడక్షన్ పనులపై కూడా ఎస్ఎస్ రాజమౌళి దృష్టి పెట్టారు. ఈ మాగ్నమ్ ఓపస్ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది.