Retro : రూ.100 కోట్ల క్లబ్‌లో సూర్య ‘రెట్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళంతో పాటు తెలుగు, హిందీ లోనూ స్టార్ హీరో సూర్యకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ‘రెట్రో’ చిత్రంతో మే1న ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి వచ్చారు సూర్య. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించింది. శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక, కార్తీకేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్‌లు నిర్మించారు. కానీ ఈ సినిమాకు ఆశించినంతగా ఫలితం దక్కలేదు. తెలుగులో అయితే డిజాస్టర్, డివైడ్ టాక్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడంతా కూడా నాని ‘హిట్ 3’ సందడి కనిపిస్తుంది. కానీ తమిళంలో మాత్రం మిక్‌డ్ టాక్ అయితే తెచ్చుకుంది. అలాగే డే వన్ మంచి వసూళ్లు వచ్చాయని ప్రకటించారు.
Also Read : Ramayana: భారీగా డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి..
Also Read
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
- Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
కేవలం తమిళనాడులోనే రూ.17 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని, ఇక వరల్డ్ వైడ్‌గా రెట్రో మూవీకి రూ.45 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని తెలిపారు. కానీ మళ్లీ రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు వసూళ్లను ప్రకటించలేదు. ఇక ఇప్పుడు ఏకంగా వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయిందని పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రబృందం. గతంలో వచ్చిన ‘కంగువ’ ఆశించిన విజయం సాధించకపోయినా, రెట్రో మిక్స్‌డ్ టాక్‌తో కూడా ఈ స్థాయి వసూళ్లు సాధించింది అంటే, అది సూర్య క్రేజ్‌కు నిదర్శనమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతే కాదు విడుదలైన 7 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరడం పట్ల సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- Pooja Hegde
- Retro
- Suriya
తాజావార్తలు
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..