నందమూరి ఫామిలీ మెగా ఫ్యామిలీల మధ్య ఫ్యాన్స్ వార్ ఇప్పటిది కాదు. ఇరు కుటుంబాలకు చెందిన హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అయితే జరిగే హంగామా మాములుగా ఉండదు. ఇక చిరు, బాలయ్య సినిమాలు పోటాపోటీగా విడుదల అయితే ఆ సందడి మాటల్లో చెప్పలేనిది. కానీ ఇటీవల కాలంలో ఈ వార్ కు బ్రేక్ పడింది. బాలయ్య ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తుండగా చిరు ఆచి తూచి చేస్తున్నారు. దింతో థియేటర్లలో ఫ్యాన్ వార్స్ కూడా కనిపించలేదు.
Also Read : NBK 109 : డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. తమన్ తాండవం
కాగా సంక్రాంతికి నందమూరి వర్సెస్ మెగా క్లాష్ జరిగేందుకు కి రెడీ గా ఉంది. వచ్చే ఏడాది జనవరి 10న రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఆ సినిమా వచ్చిన రెండు రోజుల తర్వాత బాలయ్య నటించిన డాకు మహారాజ్ రిలీజ్ కానుంది.ఈ రెండిట్లో ఏ సినిమా పై చేయి సాధిస్తుంది అనే చర్చ ఇప్ప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు ఇంకో మెగా హీరో కూడా బాలయ్య సినిమాతో రేస్ కు రెడీ అయ్యాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా సంచలన దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో రానున్న అఖండ -2 దసరా కానుకగా సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. అటు మెగా ఫామిలీ నుండియంగ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమాను కూడా సెప్టెంబరు 25న రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు. ఇలా నూతన సంవత్సరం స్టార్టింగ్ లో అలాగే దసరా నాడు బాలయ్య సినిమాతో మెగా హీరోలు పోటీపడుతున్నారు.