రవితేజ అనగానే మనకు టక్కున గుర్తోచేది మాస్ సినిమాలు, మాస్ సాంగ్స్, మాస్ ఆడియెన్స్ ను ఊపేసే డైలాగ్స్. అందుకే అందరు రవిని ఆయన ఫ్యాన్స్ మాస్ మహారాజ అని పిలుస్తారు. అటువంటి మాస్ హీరో 2004లో ఓ క్లాసిక్ సినిమా చేసాడు. అదే ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో భూమిక, గోపిక హీరోయిన్స్ గా నటించచారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా బెల్లంకొండ సురేష్ నిర్మించారు.
మాస్ ఇమేజ్ ఉన్న రవితేజ నటించిన ఈ క్లాస్ సినిమా అప్పట్లో ఓ మోస్తరు గా ఆడింది. కానీ ఇప్పటికి ఈ సినిమాలోని సాంగ్స్ క్లాస్సిక్ అనే చెప్పాలి. ఇటీవల టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ తరుణంలో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ మరోసారి ప్రేక్షకులను పలకరించేనుదుకు రెడీ అయింది. ముందుగా ఈ సినిమాను శివరాత్రి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు మేకర్స్. కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి మరో రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ ఏప్రిల్ 5న నా ఆటోగ్రాఫ్ రీరిలీజ్ కానుంది. రవితేజ కెరీర్ లో మోస్ట్ అండర్ రేటెడ్ గా నిలిచిన ఈ సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న మీ ఆటోగ్రాఫ్ ను మరోసారి థియేటర్స్ లో చూస్తూ జ్ఞాపాకాలను నెమరువేసుకోండి.,