రశ్మిక సౌత్ నుంచీ నార్త్ వైపు రాకెట్ లా దూసుకుపోతోంది. కన్నడలో మొదలైన ఈ బెంగుళూరు బ్యూటీ పయనం ఇప్పుడు తెలుగు, తమిళం మీదుగా హిందీకి చేరింది. తమిళంలో కార్తి, తెలుగులో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన మిస్ మందణ్ణా బాలీవుడ్ లోనూ క్రేజీ ఆఫర్లే కొట్టేస్తోంది. ఓ వీడియో సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు ‘సరిలేరు నాకెవ్వరూ’ అన్నట్టుగా సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది!
రశ్మిక శాండల్ వుడ్ లో ఉండగా ఆమెకు కర్ణాటక క్రష్ అనే టైటిల్ ఉండేది. అది కాస్తా ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది! బాలీవుడ్ మీడియా ఈ క్యూట్ బ్యూటీని జాతీయ సంచలనం అంటోంది. ట్విస్ట్ ఏంటంటే, నేషనల్ క్రష్ గా సెన్సేషన్ సృష్టిస్తోన్న రశ్మిక తొలి చిత్రం కూడా ఇంకా హిందీ తెర మీదకు రాలేదు. సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్నూ’ షూటింగ్ పూర్తి చేసింది. అది విడుదల కావాల్సి ఉంది. అలాగే, అమితాబ్ బచ్చన్ నటిస్తోన్న ‘గుడ్ బై’లోనూ రశ్మిక ప్రధాన పాత్ర పోషించింది. ఈ రెండూ రిలీజ్ అవ్వక ముందే మూడో చిత్రంగా మరో భారీ ఆఫర్ వచ్చిందట. రశ్మిక మందణ్ణ త్వరలోనే దానికి సంబంధించి వివరాలు తెలిపే ఛాన్స్ ఉంది!
బాలీవుడ్ లో బాగా హల్ చల్ చేస్తోన్న బెంగుళూరు బ్యూటీ బాంబే గ్లామర్ మీడియాకి న్యూ క్రేజ్ గా మారిపోయింది. ఆమెని నేషనల్ క్రష్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తోన్న పత్రికలు, ఛానల్స్, వెబ్ సైట్లు… వరుసగా ఆఫర్లు చేజిక్కించుకుంటోంది అంటూ స్టార్ ని చేసే పనిలో పడ్డాయి. ఇక హిందీ ప్రేక్షకులతో సహా తెలుగు, తమిళ, కన్నడ జనాలకి కూడా రశ్మిక ఏక కాలంలో దగ్గరవ్వటానికి, యాడ్స్ కూడా తొడ్పడుతున్నాయి. ఆమె వద్ద ఇప్పటికే భారీ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. వాటికి తోడుగా ఇంకా సరికొత్త కంపెనీలు తమ ప్రచారం కోసం రశ్మికని ఎంచుకుంటున్నాయి. ఈ బ్రాండ్ పవర్ కూడా బాలీవుడ్ లో ‘భీష్మ’ బేబీకి ఫాలోయింగ్ పెరిగేల చేస్తోంది!
హిందీ సినిమాలతోనే కాదు ‘పుష్ప’ లాంటి ప్యాన్ ఇండియా మూవీతోనూ త్వరలో రశ్మిక ఉత్తరాది కుర్రాళ్లని ఎంటర్టైన్ చేయనుంది. ఇక సౌత్ లో ఆమె జోరేంటో మనకు తెలిసిందే కదా! అందుకే, రశ్మిక ట్విట్టర్ అకౌంట్ ఇప్పుడు 2.6 మిలియన్ ఫాలోయర్స్ తో కిటకిటలాడుతోంది. ఇన్ స్టాగ్రామ్ ఖాతానైతే 15 మిలియన్ల మంది నెటిజన్స్ కు ఫేవరెట్ గా ఉంది! మీడియాలోనూ, సొషల్ మీడియాలోనూ, తెలుగులోనూ, కన్నడ, తమిళ భాషల్లోనూ తిరుగులేకుండా దూసుకుపోతోన్న ‘పుష్ప’ బ్యూటీ… బాలీవుడ్ లోనూ మ్యాజిక్ చేస్తుందని చెప్పటం అతేం కాదు. చూడాలి మరి, నేషనల్ క్రష్ రశ్మిక ముంబై గ్లామర్ రేసులో ఎంత దాకా దూసుకెళుతుందో!