మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’. ఈ సినిమా విడుదలకు సంబంధించి వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర బృందం తాజాగా స్పందించింది. ‘చికిరి చికిరి’ పాట రెస్పాన్స్‌కి కృతజ్ఞతలు చెబుతూ, అంతకుముందు ప్రకటించిన తేదీకే సినిమాను విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, వాయిదా పుకార్లకు చెక్ పెట్టింది. ఇప్పటికే ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ షాట్ గ్లింప్స్ మరియు తొలి పాట ‘చికిరి చికిరి’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ ట్రేడ్‌మార్క్ మెగా గ్రేస్, ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తూ, గ్లోబల్ సెన్సేషన్‌గా నిలిచింది.
Also Read :Akhanda 2: హైకోర్టులో షాక్… అయినా ప్రీమియర్స్ ఆన్ ట్రాక్.. పుకార్లను నమ్మవద్దు!
ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ‘పెద్ది’ టీమ్ రేపటి (శుక్రవారం) నుంచి హైదరాబాద్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు, ఇందులో కొన్ని సన్నివేశాలను ఢిల్లీలో కూడా చిత్రీకరించే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్ జనవరి నెలాఖరు వరకు కొనసాగనుంది. అప్పటికి సినిమాకు సంబంధించిన మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ప్లాన్ ప్రకారం నిర్మాణ పనులన్నీ సజావుగా సాగుతున్నాయని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చిత్ర బృందం తెలిపింది. బాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నాయికగా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక కీలక పాత్ర పోషించగా, జగపతి బాబు సహా దివ్యేందు శర్మ ముఖ్య సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను సమర్పిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 27, 2026న పాన్-ఇండియా వైడ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.