దర్శకధీరుడు రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఈ సినిమా కోసం ఓ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారట. అందులో ఒకటి “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్. ఈ ప్రమోషనల్ సాంగ్ లో “ఆర్ఆర్ఆర్” తారాగణం, టెక్నీకల్ సిబ్బందితో పాటు రాజమౌళితో గతంలో పని చేసినటువంటి హీరోలంతా భాగం కానున్నారట. ఈ పాటలో ప్రభాస్, రవితేజ, నాని, సునీల్, నితిన్ తదితరులు ఎన్‌టిఆర్, రామ్ చరణ్ హాజరుకానున్నారు. ఎంఎం కీరవాణి ఇప్పటికే ప్రత్యేక పాట కోసం ఒక ట్యూన్ కంపోజ్ చేశారు.
Read Also : మేకింగ్ వీడియో : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” ఎలా ఉందంటే..?
గతంలో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన “మగధీర” ఎండ్ టైటిల్ కార్డుల సమయంలో ఇలాంటి సాంగ్ వచ్చింది. కాగా “ఆర్‌ఆర్‌ఆర్” మొత్తం షూట్ ఆగస్టు నాటికి పూర్తవుతుందని, ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, ఓవిలియా మోరిస్, అజయ్ దేవగన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయ్యిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.