రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక భారీ పాన్ వరల్డ్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కాకముందు నుంచే భారీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, సినిమా మీద ఆసక్తి పెంచేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్ నిర్వహిస్తోంది సినిమా టీం. టాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక టైటిల్ రివీల్ కోసమే ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
Also Read: Globe Trotter: జక్కన్న లాస్ట్ మినిట్ ట్విస్ట్.. కొత్త టైటిల్ ఇదే!
ఈవెంట్‌కి ఇప్పటికే మీడియా కెమెరాలు తీసుకురావద్దని చెప్పేశారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు, వచ్చిన జర్నలిస్టుల ఫోన్లను సైతం వేదిక వద్దకు అలో చేయరని తెలుస్తోంది. వారి ఫోన్లను ఈవెంట్ నిర్వాహకులే ఈవెంట్ అయ్యే వరకు కలెక్ట్ చేసుకుని ఉంచే ఆలోచన చేస్తున్నారు. మామూలుగా ఏదైనా సినిమా ఈవెంట్ అనగానే, ఫలానా చోట ఫలానా ఈవెంట్ జరుగుతోందని హాజరు కమ్మని మాత్రమే అడుగుతారు. కానీ, సరికొత్తగా ఈసారి మాత్రం ఎవరెవరు రావాలనుకుంటున్నారో ముందే చెప్పాల్సిందిగా బాలీవుడ్ తరహాలో కోరడం ఆసక్తికరం. ఇలా చేయడం వల్ల కాస్త ఎకౌంటబిలిటీ పెరుగుతుందని టీం భావిస్తోంది.
Also Read: Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా టీవీ నటి, యాంకర్
దానికి తోడు, ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ స్ట్రీమింగ్ రైట్స్ జియో హాట్‌స్టార్ సంస్థ కొనుగోలు చేసింది. కాబట్టి, ఎలాంటి చిన్న వీడియోని సైతం బయటకు వెళ్ళనీయకుండా ఈ మేరకు ప్లాన్ చేస్తోంది సినిమా టీం. అయితే, ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ అలాగే ఇతర నటీనటులు కూడా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ అనే ప్రచారం జరుగుతోంది కానీ, ఆమె కూడా ఒక కీలక పాత్రలోనే నటిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.