Allu Arjun: షాకింగ్.. రీ రిలీజ్ వద్దన్న బన్నీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలనే కాదు, ఇటీవలే రిలీజ్ అయి మంచి కరేజ్ అందుకున్న సినిమాలను సైతం రీ-రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య బాహుబలి ఫ్యాన్స్ సినిమాను ఒక భాగంగా కట్ చేసి రిలీజ్ చేసి, సుమారు 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టారు. వీరి ప్రణాళిక ప్రకారం పుష్ప మొదటి రెండు భాగాలను కూడా ఇలాగే రిలీజ్ చేస్తారని భావించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్, సుకుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఇద్దరూ ఆ ప్రపోజల్‌ను తిరస్కరించినట్లు సమాచారం. కారణం, పుష్ప సెకండ్ పార్ట్ గత ఏడాది డిసెంబర్‌లోనే విడుదలైంది.
Also Read
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
కానీ బాహుబలి సుమారు 10 ఏళ్ల క్రితం వచ్చింది కాబట్టి ఆ సినిమా మీద ఇప్పటికీ క్రేజ్ కొనసాగుతోంది. కాబట్టి గత ఏడాది విడుదలైన సినిమాను ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేయడం సరైందేమీ కాదని వారు భావించినట్లు తెలుస్తోంది. దాంతో పాటు సుకుమార్ కూడా ఈ కటింగ్ చూసుకునేంత ఖాళీగా లేరని, ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారని సమాచారం. ఈ నేపధ్యంలో ఇప్పట్లో ఈ సినిమాను రీ-రిలీజ్ చేసే ఆలోచన లేదని చెబుతున్నారు. రామ్ చరణ్‌తో సినిమా పూర్తి చేసిన తర్వాత సుకుమార్ పుష్ప మూడవ భాగంపై దృష్టి కేంద్రీకరించనున్నారని, అల్లు అర్జున్ కూడా అట్లీ సినిమా పూర్తవగానే సుకుమార్ ప్రాజెక్టుపై ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!